Sai Srinivas | ‘అల్లుడు శీను’ స్టైల్‌లో ఎంట్రీ.. వైరల్ అవుతున్న బెల్లంకొండ శ్రీనివాస్-కావ్య రెడ్డి వీడియో

Sai Srinivas | టాలీవుడ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ రీసెంట్‌గా తన ప్రేయసి కావ్య రెడ్డితో వివాహ బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. తిరుమలలో ఘనంగా జరిగిన ఈ వివాహం తర్వాత కొత్త దంపతులు హైదరాబాద్‌లోని తమ నివాసానికి చేరుకున్నారు. అయితే ఇంట్లోకి అడుగుపెట్టే సమయంలో జరిగిన ఒక సరదా సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Sai Srinivas | టాలీవుడ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ రీసెంట్‌గా తన ప్రేయసి కావ్య రెడ్డితో వివాహ బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. తిరుమలలో ఘనంగా జరిగిన ఈ వివాహం తర్వాత కొత్త దంపతులు హైదరాబాద్‌లోని తమ నివాసానికి చేరుకున్నారు. అయితే ఇంట్లోకి అడుగుపెట్టే సమయంలో జరిగిన ఒక సరదా సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

హిందూ సంప్రదాయం ప్రకారం కొత్తగా పెళ్లైన జంట ఇంట్లోకి ప్రవేశించే ముందు తమ పేర్లు చెప్పాలి. ఈ క్రమంలో ముందుగా కావ్య రెడ్డి, “నేను కావ్య బెల్లంకొండ.. మా వారు సాయి శ్రీనివాస్ బెల్లంకొండతో మా ఇంటికి కొత్త కోడలిగా వచ్చాను” అంటూ ముద్దుగా చెప్పడంతో అక్కడున్న కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు.

ముద్దు పేరుతో..

ఆ తర్వాత బెల్లంకొండ శ్రీనివాస్‌ను కూడా పేర్లు చెప్పమని అడగగా, ఆయన మొదట సరదాగా “మా ఇంటికి మా ఆవిడను తీసుకొచ్చాను.. మీరంతా జరగండి” అంటూ నవ్వులు పూయించారు. దీంతో కుటుంబ సభ్యులు సరిగ్గా చెప్పాలని పట్టుబట్టారు. ఇదే సమయంలో కావ్య తన భర్తను “చెప్పు శ్రీని” అంటూ పిలవడం అందరినీ ఆకట్టుకుంది.

తర్వాత బెల్లంకొండ శ్రీనివాస్ “నా భార్య కావ్య బెల్లంకొండతో మా ఇంటికి వచ్చా.. నా పేరు అల్లుడు శీను” అంటూ చెప్పడంతో అక్కడ నవ్వులు పూశాయి. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతూ అభిమానులను అలరిస్తోంది.

సినిమా – నిజజీవిత అనుసంధానం:

ప్రొడ్యూసర్ బెల్లంకొండ సురేష్ కుమారుడైన శ్రీనివాస్, అల్లుడు శీను సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఇప్పుడు నిజజీవితంలో కూడా ‘అల్లుడు శీను’గా మారడం అభిమానులకు మరింత ఆసక్తిని కలిగిస్తోంది. ఆయన కెరీర్‌లో ‘స్పీడున్నోడు’, ‘జయ జానకి నాయక’, ‘సాక్ష్యం’, ‘కవచం’, ‘సీత’, ‘రాక్షసుడు’, ‘అల్లుడు అదుర్స్’, ‘ఛత్రపతి’ (హిందీ), ‘భైరవం’, ‘కిష్కింధపురి’ వంటి సినిమాల్లో నటించి ప్రత్యేక గుర్తింపు పొందారు.

ఏప్రిల్ 29న తిరుమలలో జరిగిన ఈ వివాహ వేడుకకు రాజకీయ, సినీ ప్రముఖులు హాజరై కొత్త జంటను ఆశీర్వదించారు. భట్టి విక్రమార్క సహా పలువురు ప్రముఖులు ఈ వేడుకలో పాల్గొన్నారు. ఇక ఈ జంట వెడ్డింగ్ రిసెప్షన్ మే 1న హైదరాబాద్‌లో జరగనుందని సమాచారం. ఈ కార్యక్రమానికి సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరుకానున్నట్లు తెలుస్తోంది.

Latest News