Sobhita Dhulipala | నాగచైతన్యతో రిలేషన్‌షిప్ రూమర్స్‌పై శోభిత స్పందన.. ప్రేమ, వివాహ జీవితంపై ఆసక్తికర వ్యాఖ్యలు

Sobhita Dhulipala | టాలీవుడ్ నటి శోభిత ధూళిపాళ మరోసారి తన వ్యక్తిగత జీవితం, ప్రేమ, వివాహ బంధం గురించి చేసిన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచింది. నాగచైతన్యతో వివాహానికి చాలా కాలం ముందే తమ రిలేషన్‌షిప్‌పై విస్తృతంగా ప్రచారం జరిగిన విషయాన్ని ఆమె అంగీకరించింది. అయితే ఆ అనుభవం తనకు జీవితంలో ఒక ముఖ్యమైన పాఠాన్ని నేర్పిందని వెల్లడించింది.

Sobhita Dhulipala | టాలీవుడ్ నటి శోభిత ధూళిపాళ మరోసారి తన వ్యక్తిగత జీవితం, ప్రేమ, వివాహ బంధం గురించి చేసిన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచింది. నాగచైతన్యతో వివాహానికి చాలా కాలం ముందే తమ రిలేషన్‌షిప్‌పై విస్తృతంగా ప్రచారం జరిగిన విషయాన్ని ఆమె అంగీకరించింది. అయితే ఆ అనుభవం తనకు జీవితంలో ఒక ముఖ్యమైన పాఠాన్ని నేర్పిందని వెల్లడించింది.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన శోభిత, తన గురించి వచ్చిన రూమర్స్‌కు స్పందించాల్సిన అవసరం ఎప్పుడూ అనిపించలేదని తెలిపింది. ఇతరులు ఏమనుకుంటున్నారన్న దానికంటే తన జీవితం, తన నిర్ణయాలపైనే దృష్టి పెట్టానని చెప్పింది. కాలక్రమేణా తనపై తనకు మరింత నమ్మకం పెరిగిందని, బయటివారి అభిప్రాయాలు తనను ప్రభావితం చేయకుండా జీవించడం అలవాటు చేసుకున్నానని వివరించింది.

వాటిని పెద్ద‌గా ప‌ట్టించుకోను..

ప్రజల అభిప్రాయాలు, సోషల్ మీడియా చర్చలు, వివాదాల గురించి మాట్లాడిన శోభిత వాటిని తాత్కాలిక విషయాలుగా అభివర్ణించింది. సమాజంలో జరిగే చర్చలను మారుతున్న వాతావరణంతో పోల్చుతూ, ఈ రోజు పెద్ద సమస్యగా కనిపించే విషయం రేపటికి పూర్తిగా కనుమరుగైపోవచ్చని పేర్కొంది. అందుకే ఈ విమర్శలకి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వనని చెప్పింది.

ఎప్పుడూ ప్రజల దృష్టిలో ఉండే వ్యక్తిగా ఇలాంటి ఆలోచనా విధానమే తనను మానసికంగా స్థిరంగా, బ్యాలెన్స్‌డ్‌గా ఉంచిందని శోభిత వెల్లడించింది. విమర్శలు, ప్రశంసలు రెండింటినీ సమానంగా స్వీకరించడం నేర్చుకున్నానని చెప్పింది.

భావోద్వేగాల‌ని క‌నుగొన‌డ‌మే…

ఇక ప్రేమ, వివాహ జీవితంపై కూడా ఆమె తన అభిప్రాయాలను పంచుకుంది. ప్రతి వ్యక్తి తనకు తానుగా సంపూర్ణుడని, భాగస్వామి మన జీవితాన్ని పూర్తి చేయడానికి రారని శోభిత అభిప్రాయపడింది. నిజమైన ప్రేమ అంటే ఒకరిలోని లోటును మరొకరు పూరించడం కాదని, ఇద్దరు సంపూర్ణ వ్యక్తులు ఒకరి ద్వారా మరొకరు తమలోని కొత్త కోణాలను, భావోద్వేగాలను కనుగొనడమేనని చెప్పింది.

అర్థవంతమైన సంబంధాలు వ్యక్తిత్వంలోని దాగి ఉన్న కోణాలను వెలికితీస్తాయని, మన గురించి మనకు మరింత అవగాహన కల్పిస్తాయని ఆమె పేర్కొంది. ఇలాంటి పరస్పర అవగాహన, గౌరవం ఉన్నప్పుడే ప్రేమ బలంగా నిలుస్తుందని శోభిత అభిప్రాయపడింది.

కెరీర్ విషయానికొస్తే, శోభిత త్వరలో ‘వెట్టువం’ అనే సైన్స్ ఫిక్షన్ డ్రామాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోవైపు నాగచైతన్య నటించిన ‘వృషభకర్మ’ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. వ్యక్తిగత జీవితం, కెరీర్ రెండింటినీ సమతుల్యం చేసుకుంటూ ముందుకు సాగుతున్న ఈ జంట ప్రస్తుతం అభిమానుల దృష్టిని ఆకర్షిస్తోంది.

Latest News