Samantha | తృటిలో తప్పించుకున్నా… లేదంటే సావిత్రిలా అయ్యేదాన్ని: సమంత సంచలన వ్యాఖ్యలు వైరల్
Samantha | టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత వ్యక్తిగత జీవితం ఎప్పుడూ వార్తల్లోనే ఉంటుంది. ఇటీవల ఆమె రెండో పెళ్లి చేసుకోగా, గతంలో ప్రేమ గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మళ్లీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Samantha | టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత వ్యక్తిగత జీవితం ఎప్పుడూ వార్తల్లోనే ఉంటుంది. ఇటీవల ఆమె రెండో పెళ్లి చేసుకోగా, గతంలో ప్రేమ గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మళ్లీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ముందుగా నాగచైతన్యతో ప్రేమలో పడి, పెద్దల అంగీకారంతో 2017లో వివాహం చేసుకున్న సమంత… నాలుగేళ్ల తర్వాత 2021లో విడిపోయింది. ఈ జంట విడిపోవడానికి గల కారణాలు అధికారికంగా ఎప్పుడూ బయటకు రాలేదు.అయితే 2018లో విడుదలైన మహానటి సినిమా సమయంలో సమంత ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మళ్లీ హాట్ టాపిక్‌గా మారాయి. ఈ చిత్రంలో లెజెండరీ నటి సావిత్రి జీవిత కథను చూపించారు. ఇందులో సమంత రిపోర్టర్ పాత్రలో కనిపించింది.
ఆ సమయంలో సమంత మాట్లాడుతూ…
సావిత్రి గారి గురించి ముందు అంతగా తెలియదు. ఈ సినిమా చేసిన తర్వాత చాలా విషయాలు అర్థమయ్యాయి. కొన్ని సందర్భాల్లో ‘ఇది నా కథలా ఉందే’ అనిపించింది. ప్రేమ విషయంలో నేను కూడా ఒకసారి అలా నమ్మాను. కానీ అదృష్టవశాత్తూ తృటిలో తప్పించుకున్నాను. లేదంటే నా జీవితం కూడా సావిత్రిలానే అయ్యేదీ” అని చెప్పింది.
ఈ వ్యాఖ్యలు అప్పట్లో పెద్దగా చర్చకు రాకపోయినా, ఇప్పుడు ఆమె వ్యక్తిగత జీవిత పరిణామాల నేపథ్యంలో మరింత వైరల్ అవుతున్నాయి. ఈ మాటల ద్వారా నాగచైతన్యకు ముందే సమంత ఒక ప్రేమలో మోసపోయిందని నెటిజన్లు భావిస్తున్నారు. కాగా, గతంలో కోలీవుడ్ హీరో సిద్ధార్థ్‌తో సమంతకు సంబంధం ఉందనే వార్తలు వచ్చినా, ఆమె చేసిన వ్యాఖ్యలు ఆయన గురించేనా అన్నది ఇంకా క్లారిటీ రాలేదు.
ఇద్దరు ఏయే సినిమాలలో నటించారు..
సమంత – నాగచైతన్య ప్రేమ కథ ఏం మాయ చేసావే సినిమా సమయంలో ప్రారంభమైంది. ఆ తర్వాత ‘మనం’, ‘ఆటోనగర్ సూర్య’, ‘మజిలి’ వంటి చిత్రాల్లో కలిసి నటించిన ఈ జంట, అభిమానులకు ఆదర్శంగా నిలిచింది. కానీ చివరికి విడిపోవడం అందరికీ షాక్ ఇచ్చింది.
ఇక నాగచైతన్య, శోభితా దూళిపాళ్లను వివాహం చేసుకోగా, సమంత కూడా దర్శకుడు రాజ్ నిడిమోరుతో కొత్త జీవితాన్ని ప్రారంభించింది. సినిమాల విషయానికి వస్తే, సమంత త్వరలో మా ఇంటి బంగారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram