Varanasi | బాప్ రే.. వార‌ణాసి ప్ర‌మోష‌న్స్ కోస‌మే ఏకంగా అన్ని కోట్ల బ‌డ్జెట్ కేటాయించారా..దిమ్మ‌తిరిగిపోతుందిగా..!

Varanasi | మహేష్‌బాబు, ఎస్‌.ఎస్‌.రాజమౌళి కలయికలో తెరకెక్కుతున్న ‘వారణాసి’ గురించి భారతీయ సినీ పరిశ్రమ మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌పై పాన్‌ ఇండియా స్థాయిలో అంచనాలు ఆకాశాన్ని తాకుతుండగా, ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ‘గ్లోబ్‌ట్రాటర్’ ఈవెంట్ హైప్‌ను మరో లెవెల్‌కు తీసుకెళ్లింది

Varanasi | మహేష్‌బాబు, ఎస్‌.ఎస్‌.రాజమౌళి కలయికలో తెరకెక్కుతున్న ‘వారణాసి’ గురించి భారతీయ సినీ పరిశ్రమ మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌పై పాన్‌ ఇండియా స్థాయిలో అంచనాలు ఆకాశాన్ని తాకుతుండగా, ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ‘గ్లోబ్‌ట్రాటర్’ ఈవెంట్ హైప్‌ను మరో లెవెల్‌కు తీసుకెళ్లింది. ఈ ఈవెంట్‌లో రాజమౌళి మాట్లాడుతూ, అడ్వెంచర్, ఫిక్షన్, మైథాలజీ అంశాలతో కొత్త ప్రపంచాన్ని ఆవిష్కరించబోతున్నాం అని స్పష్టం చేయడంతో ఫ్యాన్స్ మరింత ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా రామాయణంలోని ఓ కీలక ఘట్టం సినిమాలో భాగమవుతుందనే టాక్ , అందులో మహేష్‌బాబు శ్రీరాముడి గెటప్‌లో కనిపించనున్నారన్న ప్రచారం వైరల్ అవుతోంది.

మరోవైపు వారణాసి టైటిల్ పై నెలకొన్న వివాదం, దేవుళ్లపై రాజమౌళి చేసిన కామెంట్లు సోషల్‌మీడియాలో ట్రోలింగ్‌కు దారితీశాయి. ప్రాజెక్ట్ అంచనాలకు తగ్గట్టుగానే బడ్జెట్ కూడా రికార్డు స్థాయిలో పెరుగుతోందని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. మొదట్లో రూ. 1000 కోట్లు అని ప్రచారం జరిగినా, ఇప్పుడు అది రూ.1200 నుంచి రూ.1500 కోట్లు చేరిందని ఇండస్ట్రీ టాక్. భారీ సెట్లు, అత్యాధునిక టెక్నాలజీ, ప్రపంచవ్యాప్తంగా షూట్ లొకేషన్లు, భారీ యాక్షన్ ఎపిసోడ్‌లు ఇవన్నీ కలిసి ఖ‌ర్చు భారీగా పెరిగేలా చేస్తున్నాయ‌ని అంటున్నారు. ఇక సినిమా ప్రమోషన్ కోసం నిర్వహించిన ఈవెంట్‌కే మేకర్స్ దాదాపు రూ.30 కోట్లు ఖర్చు చేశారని తెలుస్తోంది. ఇంటర్నేషనల్ మీడియా, స్టేట్-ఆఫ్-ది-ఆర్ట్ ఎల్ఈడీ సెటప్, ప్రత్యేక విజువల్ ప్రెజెంటేషన్ ఈవెంట్‌ను భారీగా మార్చాయి.

పూర్తి ప్రమోషన్ క్యాంపైన్‌కే రూ.200 కోట్ల వరకు వెచ్చిస్తారన్న టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది. ఈ చిత్రంలో నటీనటులు, టెక్నీషియన్స్ రెమ్యూనరేషన్ కూడా మరో లెవెల్‌లోనే ఉంది. మహేష్ బాబు ఈ చిత్రంలో ప్రాఫిట్ షేరింగ్ పార్టనర్‌గా ఉంటాడ‌నే టాక్ వినిపిస్తుంది. ఇక రాజ‌మౌళి షేర్ ఆధారంగా ఒప్పందం కుదుర్చుకున్న‌ట్టు స‌మాచారం. ఇక చిత్రంలో హీరోయిన్‌గా న‌టిస్తున్న ప్రియాంక చోప్రాకి రూ. 30కోట్ల పారితోషికం తీసుకుంటుంద‌ని అంటున్నారు. ఇక ప్ర‌తినాయ‌కుడిగా న‌టిస్తున్న పృథ్వీరాజ్ సుకుమార్‌కి రూ.10 కోట్ల ఆఫ‌ర్ చేశార‌ని టాక్. భారీ పారితోషికాల వ‌ల‌న బ‌డ్జెట్ కూడా భారీగానే పెరిగింది. ‘వారణాసి’లో ప్రతి ఫ్రేమ్ రాజమౌళి విజన్‌కు తగ్గట్టు విజువల్ గ్రాండియర్‌తో నిండి ఉంటుందని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి.

Latest News