Fish Eggs | చేప‌గుడ్లను ఛీ కొట్టకండి.. వాటితో కలిగే లాభాలు తెలుసుకోండి..!

  • Publish Date - April 9, 2024 / 10:25 AM IST

Fish Eggs: చేప‌లు మాత్రమే కాదు, చేప‌ల గుడ్లు కూడా ఆరోగ్యానికి చాలా మంచివ‌ని, ముఖ్యంగా గుండె ఆరోగ్యానికి చేప‌ల గుడ్లు ఎంతో మేలు చేస్తాయ‌ని హెల్త్‌ ఎక్స్‌పర్ట్స్‌ చెబుతున్నారు. కానీ వాస్తవానికి చాలామంది మార్కెట్‌లో చేప‌లను ముక్కలుగా క‌ట్ చేయించి, వాటిలో గుడ్లు వ‌స్తే తీసేయమంటారు. మీరు కూడా గ‌తంలో అలాగే చేసి ఉండ‌వ‌చ్చు. కానీ చేప గుడ్లతో ఎన్ని ఆరోగ్య ప్రయోజ‌నాలున్నాయో తెలిస్తే మాత్రం ఇకపై ఆ ప‌నిచేయ‌రు. క‌చ్చితంగా చేప గుడ్లను ఇంటికి తీసుకెళ్లి వండుకుతింటారు.

ఎలా వండుకోవాలి..?

చేపగుడ్లతో అనేక ప్రయోజనాలు ఉన్నా వాటిని వండటం చాలా మందికి తెలియ‌దు. కానీ అది పెద్ద కష్టమేం కాదు. చేప‌లు వండిన‌ట్లుగానే చేప‌గుడ్లను కూడా ర‌క‌ర‌కాలుగా కూర‌లు వండుకోవ‌చ్చు. ఫ్రై చేసుకుని కూడా తిన‌వ‌చ్చు. వండే విధానం తెలియకపోతే యూట్యూబ్‌లో చూసి మీకు నచ్చిన ఫ్లేవర్‌లో వంట వండుకోండి. వాటిని ఏ పద్ధతిలో వండుకున్నా ఆరోగ్య ప్రయోజనాలు ఒకేలా ఉంటాయి.

ప్రయోజనాలు..

1. సాధార‌ణంగా చేపగుడ్లలో విటమిన్ A ఉంటుంది. ఈ విటమిన్ A కంటి చూపును మెరుగుపరుస్తుంది. కళ్లకు హాని జరుగకుండా కాపాడుతుంది.

2. రెగ్యులర్‌గా చేపగుడ్లు తింటే మీ రక్తంలో హిమోగ్లోబిన్ పెరుగుతుంది. రక్తం శుద్ధి అవుతుంది. రక్తహీనతతో బాధపడేవారికి చేపగుడ్లు దివ్యౌషధంలా ప‌నిచేస్తాయి.

3. చేపగుడ్లలో విటమిన్ D కూడా ఉంటుంది. ఇది మీ ఎముకలు, దంతాలను బలంగా త‌యారు చేస్తుంది. అంతేగాక‌ గుండె జబ్బులు రాకుండా విటమిన్ D కాపాడుతుంది.

4. మతిమరపు స‌మ‌స్య ఉన్నవారు, అల్జీమర్స్ పేషెంట్లు క్రమం తప్పకుండా చేపగుడ్లు తినాలి. దాంతో స‌మ‌స్య నుంచి త్వర‌గా ప‌రిష్కారం ల‌భించే అవ‌కాశం ఉంది.

5. అధిక ర‌క్తపోటు స‌మ‌స్య ఉన్నవారికి కూడా చేపగుడ్లు చాలా మంచివి. రెగ్యుల‌ర్‌గా చేప‌గుడ్లను ఆహారంగా తీసుకుంటే బీపీ స‌మ‌స్య క్రమంగా త‌గ్గుముఖం ప‌డుతుంది.

Latest News