High Cholesterol | అధిక కొవ్వుతో బాధపడుతున్నారా? ఈ నాలుగింటిని తింటే ఊహించని విధంగా బరువు తగ్గుతారు..!

High Cholesterol | ప్రస్తుతం కొలెస్ట్రాల్‌ సమస్య వేగంగా పెరుగుతున్నది. మారుతూ వస్తున్న జీనవశైలిలో మార్పుల కారణంగా కొలెస్ట్రాల్‌ ముప్పు పెరుగుతున్నది. ఫలితంగా గుండె, మెదడు వ్యాధులబారినపడే ప్రమాదం ఉన్నది. కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు శరీరంలో ఎలాంటి లక్షణాలు కనిపించవు, కానీ, కొలెస్ట్రాల్‌ స్థాయి పెరిగితే అనేక వ్యాధుల బారినపడే ప్రమాదం ఉంటుంది. అందుకే కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు మీరు ఏయే పదార్థాలను తీసుకోవాలో ఓ సారి తెలుసుకుందాం రండి..! ఓట్స్ : […]

  • Publish Date - February 26, 2023 / 05:33 PM IST

High Cholesterol | ప్రస్తుతం కొలెస్ట్రాల్‌ సమస్య వేగంగా పెరుగుతున్నది. మారుతూ వస్తున్న జీనవశైలిలో మార్పుల కారణంగా కొలెస్ట్రాల్‌ ముప్పు పెరుగుతున్నది. ఫలితంగా గుండె, మెదడు వ్యాధులబారినపడే ప్రమాదం ఉన్నది. కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు శరీరంలో ఎలాంటి లక్షణాలు కనిపించవు, కానీ, కొలెస్ట్రాల్‌ స్థాయి పెరిగితే అనేక వ్యాధుల బారినపడే ప్రమాదం ఉంటుంది. అందుకే కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు మీరు ఏయే పదార్థాలను తీసుకోవాలో ఓ సారి తెలుసుకుందాం రండి..!

ఓట్స్ : కొలెస్ట్రాల్‌ సమస్య నుంచి బయటపడాలంటే అల్పాహారంలో ఓట్స్ తీసుకోవాలి. దాంతో సిరల్లో పేరుకుపోయిన కొలెస్ట్రాల్‌ దానంతట అదే కరిగిపోతుంది. అధిక కొవ్వు బాధపడున్నట్లయితే తప్పనిసరిగా ఓట్స్‌ తీసుకుంటే బరువు సైతం తగ్గుతూ వస్తారు. వోట్స్ అత్యంత తేలికైన, అత్యంత ప్రయోజనకరమైన ఆహారాల్లో ఒకటి. ఇది గ్లూటెన్ రహితంగా ఉంటుంది. తద్వారా బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

ఆపిల్ : ఆపిల్ ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. రోజూ ఆపిల్ తీసుకోవడం ద్వారా హై కొలెస్ట్రాల్‌ను నియంత్రించవచ్చు. ఈ క్రమంలో కొలెస్ట్రాల్‌ ముప్పు నుంచి బయటపడాలంటే ప్రతిరోజూ ఓ ఆపిల్ తినాలి. దాంతో బరువు సైతం తగ్గుతారు. ఈ పండులో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇంకా మినరల్స్, విటమిన్స్, యాంటి యాక్సిడెంట్లు, విటమిన్ సీ తదితర ఎన్నో పోషకాలున్నాయి. ఆపిల్ తినడం వల్ల శరీరానికి కావాల్సిన ఎన్నో పోషకాలు అందుతాయి.

క్యారెట్ : క్యారెట్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంలో మెరుగ్గా పని చేస్తుంది. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల కొవ్వు సమస్యలతో బాధపడేవారు కార్యెట్‌ తీసుకుంటే మంచి ఫలితాలుంటాయి. క్యారెట్‌ రెగ్యులర్‌గా తినడం వల్ల మలబద్దకం దూరం చేస్తుంది. ఇది ప్రేగుల్లో పేరుకుపోయిన మలాన్ని శుద్ధి చేస్తుంది.

సైలియం ఊక : కొలెస్ట్రాల్ సమస్యతో పోరాడుతున్న సైలియం (ఇసాబ్గోల్ పొట్టు)ను తీసుకోవాలి. దాంతో కొవ్వు కరిగిపోతుంది. సైలియం ఊక అనేది ఒక రకమైన ఫైబర్. ఇది ప్లాంటాగో ఓవాటా మొక్క నుంచి తయారవుతుంది. అంతే కాకుండా సైలియం ఊక మలబద్ధకం నిరోధించడం‌లో సహాయపడుతుంది. గుండెకు ఉపయోగకరంగా ఉండడంతో పాటు డయాబెటిస్‌ను నియంత్రణలో ఉంచేందుకు సహాయపడుతుంది.

Latest News