Health tips | తులసి రసంలో అది కలుపుకుని తాగితే కిడ్నీల్లో రాళ్లు కరిగిపోతాయ్‌..!

Health tips : తులసి మొక్కను మన పూర్వీకులు అత్యంత పవిత్రమైనదిగా కొలిచేవారు. ఉదయం లేవగానే తులసి పూజ చేయకుండా పనులు మొదలు పెట్టేవారు కాదు. పురాణాలలో కూడా తులసి మొక్కను విష్ణుమూర్తికి అత్యంత ప్రీతిపాత్రమైనదిగా భావిస్తారు. అత్యంత ఆరోగ్యకర అంశాలు తులసిలో ఉన్నాయి. ఎంతో పవిత్రతను, ప్రాధాన్యాన్ని సంతరించుకున్న తులసిని నేడు ఔషధాల తయారీలో ఎక్కువగా ఉపయోగిస్తున్నారు.

  • Publish Date - June 13, 2024 / 06:28 PM IST

Health tips : తులసి మొక్కను మన పూర్వీకులు అత్యంత పవిత్రమైనదిగా కొలిచేవారు. ఉదయం లేవగానే తులసి పూజ చేయకుండా పనులు మొదలు పెట్టేవారు కాదు. పురాణాలలో కూడా తులసి మొక్కను విష్ణుమూర్తికి అత్యంత ప్రీతిపాత్రమైనదిగా భావిస్తారు. అత్యంత ఆరోగ్యకర అంశాలు తులసిలో ఉన్నాయి. ఎంతో పవిత్రతను, ప్రాధాన్యాన్ని సంతరించుకున్న తులసిని నేడు ఔషధాల తయారీలో ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. తులసిలోని ఔషధ గుణాలను సౌందర్య పోషణకు కూడా వాడుకుంటున్నారు. తులసిలోని కొమ్మలు, ఆకులు, విత్తనాలు, కాడలు, వేర్లు, వేర్ల దగ్గరి మట్టి కూడా ఔషధ గుణాలను కలిగి ఉంటాయి. కాబట్టి ఇంట్లో తులసి మొక్క ఉంటే ఆరోగ్యపరంగా ఎన్నో లాభాలుంటాయి. అవేంటో చూద్దాం..

ఇవీ ప్రయోజనాలు..

  • ఔషధ విలువలు సమృద్ధిగా ఉన్న తులసివల్ల లాభాలెన్నో ఉన్నాయని ఆయుర్వేదం చెబుతోంది. కాచి చల్లార్చిన నీళ్లలో తులసి రసాన్ని కలుపుకొని ఉదయాన్నే ఖాళీ కడుపుతో తాగితే మెదడు చురుకుగా పనిచేస్తుంది. అంతేకాదు జీర్ణక్రియ మెరుగుపడుతుంది.
  • తులసి రసంలో తేనె కలుపుకొని తాగితే కిడ్నీలో ఉండే రాళ్ళు కరిగిపోతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
  • అదేవిధంగా అల్లం రసంతో తులసి రసాన్ని కలిపి తాగితే కడుపు నొప్పి తగ్గుతుంది. పొట్టలో నులిపురుగులు నశిస్తాయి.
  • జలుబు చేసినప్పుడు తేనెలో ఒక టేబుల్‌ స్పూన్‌ తులసి రసం కలుపుకొని తాగితే ఉపశమనం లభిస్తుంది.
  • అంతేగాక బెల్లంతో తులసి ఆకులు కలిపి తింటే కామెర్లు తగ్గుముఖం పడతాయి.
  • తులసి ఆకులు జ్వరాన్ని తగ్గిస్తాయి. అల్సర్‌ల నుంచి రక్షణ లభిస్తుంది. రక్తంలో షుగర్‌ స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. కాలేయం శక్తిమంతంగా పని చేస్తుంది. నోటి దుర్వాసనను పోగోడుతుంది.
  • అదేవిధంగా అలర్జీల నుంచి ఉపశమనం కలిగిండంలో, ఒత్తిడిని దూరం చేయడంలో కూడా తులసి ఆకులు తోడ్పడుతాయి.
  • దాదాపు అందరి ఇళ్లలోనూ ప్రధాన ద్వారానికి ఎదురుగా లేదా పెరట్లో తులసి మొక్క ఉంటుంది. ఎందుకంటే తులసి ఆకుల నుంచి వచ్చే సువాసన ఇల్లంతా పరుచుకొని మంచి యాంటీసెప్టిక్‌గా పనిచేస్తూ వ్యాధులు రాకుండా చేస్తుంది.

Latest News