Silent Heart Attack | ప్రస్తుతం ప్రతి ఒక్కరూ బిజీ లైఫ్( Busy Life ) గడుపుతున్నారు. రాత్రనక, పగలనక.. నిత్యం తమ పనుల్లో నిమగ్నమైపోతున్నారు. ఇలా పని చేసే వారు ఎక్కువగా గుండె జబ్బుల( Heart Diseases ) బారిన పడుతున్నట్లు పలు అధ్యయనాల్లో తేలింది. ఇక అర్ధరాత్రి వేళ పని చేసేవారిలో గుండె సమస్యలు అధికమవుతున్నాయని, ఇలాంటి వారిని సైలెంట్ హార్ట్ ఎటాక్స్( Silent Heart Attack ) అటాక్ చేసి ప్రాణాలను బలిగొంటున్నట్టు వెల్లడైంది. కాబట్టి వీలైనంత వరకు అర్ధరాత్రి( Mid Night ) వేళ పనులు మానేస్తేనే గుండె( Heart )ను పది కాలాల పాటు పదిలంగా కాపాడుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఇంతకీ ఏ మిస్టేక్స్ వల్ల ఈ సమస్యలు వస్తున్నాయో.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
చాలా మంది పగటి పూట పనులకే అధిక ప్రాధాన్యం ఇస్తారు. కొందరు రాత్రిళ్లు పని చేసేందుకు ప్రాధాన్యం ఇస్తారు. ఇలా రాత్రిళ్లు పనులు చేసే వారిలో గుండె సమస్యలు( Heart Problems ) ఎక్కువగా సంభవిస్తాయట. నిద్ర పోకుండా పని చేయడం కారణంగా.. హృదయనాళ వ్యవస్థకు ఇబ్బంది కలిగించి.. ప్రాణాలను హరిస్తున్నాయట. అయితే సైలెంట్ హార్ట్ ఎటాక్స్( Silent Heart Attack ) ఎలాంటి అలెర్ట్ ఇవ్వకుండా వస్తాయనుకుంటారు. కానీ కొన్ని సంకేతాలు ఉంటాయి. వాటిని గ్రహిస్తే.. గుండెపోటు( Heart Stroke ) నుంచి తప్పించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఛాతీలో నొప్పి రావడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలగడం వంటివి సైలెంట్ హార్ట్ ఎటాక్‌కి సంకేతాలు. మరి ఈ సమస్యను ప్రేరెపించే పనులు ఏంటో తెలుసుకుందాం..
సమయానికి నిద్రించకపోవడం..
ప్రస్తుతం చాలా మంది సమయానికి నిద్రపోరు. పని బిజీలో పడి.. నిద్రను( Sleeping ) దూరం చేసుకుంటున్నారు. దీంతో గుండె ఆరోగ్యం( Heart Health ) దెబ్బతింటుంది. నిద్ర వేళల్లో మార్పులు చేసుకున్నా, నిద్ర వ్యవధిలో మార్పులు జరిగినా.. సెలైంట్ హార్ట్ ఎటాక్‌కి దారి తీస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సరైన సమయంలో నిద్రించకపోవడం కారణంగా సిర్కాడియన్ రిథమ్ దెబ్బతిని.. మెటబాలీజం( Metabolism )ను ప్రభావితం చేస్తుందట. ఇది హృదయనాళ ఆరోగ్యంపై ప్రతికూలంగా ప్రభావం చూపిస్తుంది. దీనివల్ల రక్తపోటు( Blood Pressure ), హార్మోన్ ఇంబ్యాలెన్స్, గుండె జబ్బులు వేగంగా వృద్ధి చెందుతాయి.
అర్ధరాత్రి వేళ డిన్నర్ చేయడం..
చాలా మంది సమయం సందర్భం లేకుండా డిన్నర్( Dinner ) చేస్తుంటారు. నిద్రించాల్సిన అర్ధరాత్రి సమయంలో హాటల్స్‌కు వెళ్లి డిన్నర్ చేస్తుంటారు. ఇలా అర్ధరాత్రి పూట తినడం కారణంగా.. ఆహారం సరిగా జీర్ణం కాక.. అది చెడు కొవ్వుగా పేరుకుపోతుంది. దీంతో బరువు పెరిగి.. స్లీప్ ఆప్నియా( Sleep Apnea ) మరింత ఎక్కువ అవుతుంది. ఇది గుండె జబ్బులకు దారి తీస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగి మధుమేహం తీవ్రమవుతుంది. సాయంత్రం 7 గంటల లోపు డిన్నర్ ముగించడం ఎంత మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
అర్ధరాత్రి వేళ ఆల్కహాల్ మంచిది కాదు..
ఫంక్షన్లు, డిన్నర్లకు వెళ్లే వారిలో చాలా మంది అర్ధరాత్రి పూల ఆల్కహాల్( Alcohol ) సేవిస్తుంటారు. ఇలా అర్ధరాత్రి పూట మద్యం సేవించడం మంచిది కాదు. అర్ధరాత్రి మ్యదం తాగడం కారణంగా.. గుండె ఆరోగ్యాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. నిద్రకు అంతరాయం కలిగిస్తుంది. గుండె సమస్యలను తీవ్రతరం చేస్తుంది. ఆల్కహాల్ ఎక్కువగా తీసుకుంటే గుండె జబ్బులు, స్ట్రోక్స్ ప్రమాదం ఎక్కువగా ఉంటాయని ఇప్పటికే పలు పరిశోధనలు తేల్చాయి.
నిద్ర నాణ్యత
కొందరికి మంచి నిద్ర ఉంటుంది. మరికొందరికి నిద్ర సమస్యలు ఉంటాయి. తరచూ మేల్కొవడం, నిద్ర త్వరగా రాకపోవడం, నిద్ర సమయం తగ్గిపోవడం వంటి సమస్యలతో ఇబ్బంది పడతారు. ఈ సమస్యలు దీర్ఘకాలికంగా ఇబ్బంది పెడితే గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఎక్కువ అవుతుందని పరిశోధనలు చెప్తున్నాయి. స్లీప్ ఆప్నియా ఉంటే నిద్రలో మెలకువ ఎక్కువగా ఉంటుందట. దీనివల్ల బ్రీతింగ్ సమస్యలు వచ్చి ఆక్సిజన్ స్థాయిల్లో హెచ్చు, తగ్గులకు కారణమవుతుంది. ఒత్తిడి హార్మోన్లను పెంచి.. అధిక రక్తపోటు, గుండె జబ్బులను పెంచుతుంది.