శృంగారం మీద ఆస‌క్తి త‌గ్గుతుందా..! ఈ ఆహారం తీసుకుంటే ర‌స‌భ‌రితమే..!!

శృంగార జీవితం మెరుగ్గా ఉండాల‌న్నా, దంప‌తులు ఇద్ద‌రు సుఖంగా ఉండాల‌న్నా.. మ‌రి ముఖ్యంగా జీవ‌న‌శైలిని మార్చుకోవాలి. ప్ర‌ధానంగా మ‌నం తీసుకునే ఆహారం మీద దృష్టి సారించాలి. ఏయే ఆహార పదార్థాలు శృంగారానికి మేలు చేస్తాయో తెలుసుకుందాం.

  • Publish Date - May 13, 2024 / 09:38 AM IST

దాంప‌త్య జీవితం సుఖ‌మ‌యంగా సాగాలంటే.. శృంగార జీవితం చాలా ముఖ్యం. శృంగారం జీవితం స‌రిగ్గా లేక‌పోతే.. దంప‌తుల మ‌ధ్య బంధం బ‌ల‌హీన‌మ‌వుతుంది. ఇరువురి మ‌ధ్య గ్యాప్ ఏర్ప‌డే అవ‌కాశం ఉంటుంది. కొన్ని సంద‌ర్భాల్లో దంప‌తులు విడిపోయే ప్ర‌మాదం కూడా ఉంటుంది. మ‌రి శృంగార జీవితం మెరుగ్గా ఉండాల‌న్నా, దంప‌తులు ఇద్ద‌రు సుఖంగా ఉండాల‌న్నా.. మ‌రి ముఖ్యంగా జీవ‌న‌శైలిని మార్చుకోవాలి. ప్ర‌ధానంగా మ‌నం తీసుకునే ఆహారం మీద దృష్టి సారించాలి. ఏయే ఆహార పదార్థాలు శృంగారానికి మేలు చేస్తాయో తెలుసుకుందాం.

దానిమ్మ

శృంగారానికి దానిమ్మ పండు ఎంతో మంచిది. రోజుకు ఒక దానిమ్మ పండును తింటే శృంగారం జీవితం ర‌స‌భ‌రితంగా ఉంటుంది. దానిమ్మ పండు తిన‌డంతో శ‌రీరంలో ఒత్తిడి త‌గ్గి, ర‌క్త‌ప్ర‌స‌ర‌ణ మెరుగువుతుంది. టెస్టోస్టిరాన్ స్థాయిలు కూడా పెరుగుతాయి. దాంతో శృంగారం జీవితాన్ని ఎంతో అనుభూతి పొందొచ్చు. దంప‌తులిద్ద‌రూ దానిమ్మ పండు తింటే ఇంకా ఎంతో మంచిది. ఈ పండు సంతానోత్ప‌త్తికి చిహ్నం కూడా.

పుచ్చకాయ(వాట‌ర్ మెల‌న్)

ఎండాకాలంలో పుచ్చ‌కాయ విరివిరిగా దొరుకుతుంది. రోడ్ల‌పై ఎక్క‌డ అంటే అక్క‌డ విక్ర‌యిస్తుంటారు. ఈ పుచ్చ‌కాయ వేస‌వి తాపాన్ని తీర్చ‌డ‌మే కాకుండా లైంగిక కోరిక‌ల‌ను తీర్చుతుంది. శృంగార జీవితంలో పుచ్చ‌కాయ ఎంతో కీల‌కం. పుచ్చ‌కాయ‌లో సిట్రులిన్ అనే అమైనో యాసిడ్స్ ఉంటాయి. ఈ యాసిడ్స్ మ‌గ‌వారిలో అంగ‌స్తంభ‌న‌కు ఎంతో ఉప‌యోగ‌ప‌డుతాయి. ఈ పండును తింటే వ‌యాగ్రా మాదిరి ప్ర‌యివేటు అవ‌య‌వాల్లో ర‌క్త ప్ర‌స‌ర‌ణ‌ను మెరుగుప‌రిచి, సుఖ‌మైన జీవితానికి ఉప‌యోగ‌ప‌డుతుంది.

పాలకూర

పాల కూర కూడా శృంగారానికి ఎంతో మేలు చేస్తుంది. ఈ ఆకు కూర‌లో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. ఇది కూడా టెస్టోస్టిరాన్​ స్థాయిల‌ను పెంచుతుంది. పాల‌కూర‌లోని ఐరన్ కోరిక, ఉద్రేకం, ఉద్వేగాన్ని పెంచడంలో ఎంతో స‌హాయ‌ప‌డుతుంది. ఇది లైంగిక జీవితంలో స్త్రీలకు చాలా మంచిది. పాల‌కూర‌ను ట‌మాటాతో క‌లిపి తిన‌కుండా ఉంటే మంచిది.

డార్క్ చాక్లెట్స్

డార్క్ చాక్లెట్స్ వల్ల కలిగే లాభాల్లో ఇది కూడా ఒకటి. ఇది శరీరంలో సెరోటోనిన్​ను విడుదల చేస్తుంది. అంతేకాకుండా మీ మూడ్​ని బూస్ట్ చేస్తుంది. ప్రేమ, లైంగిక కోరికలను పెంచే ఫెనిలేథైలమైన్ అనే కెమికల్​ డార్క్ చాక్లెట్స్‌లో పుష్కలంగా ఉంటుంది.

సీ ఫుడ్

దాదాపు సీ ఫుడ్స్ జింక్​తో నిండి ఉంటాయి. ఇవి శరీరంలో టెస్టోస్టిరాన్​ను ఉత్పత్తి చేస్తాయి. ఇది లైంగిక జీవితంలో అతిపెద్ద పాత్ర పోషిస్తుంది. పురుషుల్లో ఎక్కువ స్పెర్మ్​ని ఉత్పత్తి చేయడానికి, స్పెర్మ్ కణాలు ఎక్కువగా కదలడానికి కూడా ఇది హెల్ప్ చేస్తుందట. తృణధాన్యాలు, గుమ్మడి గింజలు, జీడిపప్పులు, పెరుగులో కూడా జింక్ ఎక్కువగా ఉంటుంది.

Latest News