హైదరాబాద్ నాలా పనుల్లో జాప్యం..కట్టెల వంతెన వీడియో వైరల్!
విశ్వనగరంలో కట్టెల వంతెన! బంజారాహిల్స్‌లో నాలా పనుల జాప్యంతో బస్తీ వాసులు ఆ నాలా దాటేందుకు తాత్కాలికంగా ఓ కట్టెల వంతెన ఏర్పాటు చేసుకున్నారు. దానిపైనే తమ పిల్లలను స్కూలుకు తీసుకెళ్లేందుకు నానా పాట్లు పడుతున్నారు.
విధాత, హైదరాబాద్: సాధారణంగా మారుమూల గ్రామాల్లోనే లేక ఏజెన్సీ ప్రాంతాల్లోనే నదులు, కాలువలపై వంతెనలు లేక కట్టెలతో కూడిన తాత్కాలిక వంతెనలను స్థానికులు వినియోగిస్తుండటం చూస్తుంటాం. అలాంటి దృశ్యమే ఇప్పుడు విశ్వనగరంగా చెప్పుకునే రాజధాని హైదరాబాద్‌లో వెలుగు చూసిన ఘటన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బంజారాహిల్స్ రోడ్ నెంబర్5లోని దేవరకొండ బస్తీలో 2 నెలలు గడుస్తున్నా.. నాలా పునర్నిర్మాణ పనులు పూర్తి కాలేదు. దీంతో బస్తీ వాసులు ఆ నాలా దాటేందుకు తాత్కాలికంగా ఓ కట్టెల వంతెన ఏర్పాటు చేసుకున్నారు.
దానిపైనే తమ పిల్లలను స్కూలుకు తీసుకెళ్లేందుకు ప్రమాదకరంగా వారిని చేతులపై ఎత్తుకుని నాలా దాటిస్తూ..బస్తీ వాసులు నానా పాట్లు పడుతున్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు న్యూయార్క్ వంటి విశ్వనగరాలతోనే.. నా పోటీ అని చెప్పే సీఎం రేవంత్ రెడ్డి.. ముందు సిటీలోని నాలా పనులు పూర్తి చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి :
ఇది దేశ వ్యతిరేక బిల్లు : రాహుల్ గాంధీ
సంపాదనలో అంబానీని దాటేసిన అదానీ.. ఆసియాలోనే నం.1
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram