Hyderabad | మీర్‌పేట్‌లో భయానక హిట్ అండ్ రన్.. కారు బానెట్‌పై 2 కి.మీ ఈడ్చుకెళ్లిన డ్రైవర్

Hyderabad | హైదరాబాద్  నగరంలో మరోసారి రోడ్డు భద్రతపై ప్రశ్నలు లేవనెత్తే ఘటన చోటుచేసుకుంది. మీర్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ భయానక హిట్ అండ్ రన్ ఘటన స్థానికులను తీవ్ర భయాందోళనలకు గురిచేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, మే 1న ఎస్.కె. జిలానీ తన కుమారుడు ఫైసల్‌తో కలిసి బైక్‌పై గాయత్రి నగర్ నుంచి ఎల్బీనగర్ వైపు ప్రయాణిస్తున్నారు.

Hyderabad | హైదరాబాద్  నగరంలో మరోసారి రోడ్డు భద్రతపై ప్రశ్నలు లేవనెత్తే ఘటన చోటుచేసుకుంది. మీర్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ భయానక హిట్ అండ్ రన్ ఘటన స్థానికులను తీవ్ర భయాందోళనలకు గురిచేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, మే 1న ఎస్.కె. జిలానీ తన కుమారుడు ఫైసల్‌తో కలిసి బైక్‌పై గాయత్రి నగర్ నుంచి ఎల్బీనగర్ వైపు ప్రయాణిస్తున్నారు. ఈ సమయంలో మీర్‌పేట్ సమీపంలో వెనుక నుంచి వేగంగా వచ్చిన కారు వారి బైక్‌ను ఢీకొట్టింది. ప్రమాదంతో కిందపడిపోయిన తండ్రి, కుమారుడు డ్రైవర్‌ను ప్రశ్నించగా, వాగ్వాదం చోటుచేసుకుంది.ఈ క్రమంలో డ్రైవర్ బాధితులపై దాడి చేసి అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నించాడు.

అతడిని అడ్డుకునేందుకు జిలానీ కారు ముందు నిలబడగా, డ్రైవర్ కనికరం లేకుండా వాహనాన్ని ముందుకు నడిపించాడు. ప్రాణాల కోసం జిలానీ   కారు బానెట్‌ను పట్టుకోవడంతో, డ్రైవర్ సుమారు 2 కిలోమీటర్ల మేర అతడిని ఈడ్చుకెళ్లాడు.బాధితుడు సహాయం కోసం అరుస్తున్నా, ఇతర వాహనదారులు హెచ్చరించినా డ్రైవర్ ఏమాత్రం ఆగకుండా బాలాపూర్ క్రాస్‌రోడ్స్ దాటి మందమల్లమ్మ జంక్షన్ వరకు దూసుకెళ్లాడు. ఈ దృశ్యాన్ని గమనించిన స్థానికులు ధైర్యంగా ముందుకు వచ్చి వాహనాన్ని అడ్డగట్టారు. దీంతో డ్రైవర్ కారును అక్కడే వదిలేసి పరారయ్యాడు.ఈ ఘటనలో ఫైసల్‌కు తీవ్ర గాయాలు కావడంతో రెండు కాళ్లు విరిగిపోయాయి. ప్రస్తుతం అతను ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. జిలానీ కూడా తీవ్ర గాయాలతో బాధపడుతున్నారు.

సమాచారం అందుకున్న పోలీసులు  ఘటన స్థలానికి చేరుకుని కారును స్వాధీనం చేసుకున్నారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడిని గుర్తించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. పరారీలో ఉన్న డ్రైవర్ కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు హత్యాయత్నం, హిట్ అండ్ రన్ కేసులు నమోదు చేశారు. నగరంలో ఇలాంటి ఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి నేరాలకు కఠిన శిక్షలు విధించాలని, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసే వారి లైసెన్స్‌లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

Latest News