• Telugu News
  • /Hyderabad

Heavy Rains Alert | రేప‌ట్నుంచి తెలంగాణ‌కు భారీ వ‌ర్ష సూచ‌న‌

తెలంగాణ రాష్ట్రంలో (Telangana) రానున్న మూడు రోజుల పాటూ అకాల‌ వ‌ర్షాలు (Heavy Rains) కురిసే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ హెచ్చ‌రించింది.

Reported by: Tejaswini Nanna | హైదరాబాద్​ | Feb 20, 2026, 5:11 pm IST
Read Time: 2 mins
Heavy Rains Alert | రేప‌ట్నుంచి తెలంగాణ‌కు భారీ వ‌ర్ష సూచ‌న‌

Heavy Rains Alert | తెలంగాణ రాష్ట్రంలో (Telangana) రానున్న మూడు రోజుల పాటూ అకాల‌ వ‌ర్షాలు (Heavy Rains) కురిసే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ హెచ్చ‌రించింది. మారిన వాతావరణ పరిస్థితుల కారణంగా ఫిబ్ర‌వ‌రి 22 నుంచి 24 వరకు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంద‌ని వెల్లడించింది.

22న ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాల్లో వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని తెలిపింది. ఫిబ్ర‌వ‌రి 23, 24 తేదీల్లో సెంట్ర‌ల్ తెలంగాణ‌తోపాటూ తూర్పు, ఉత్త‌ర తెలంగాన‌, ధక్షిణ తెలంగాణ ప్రాంతాల్లో తేలిక‌పాటి నుంచి భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని హెచ్చ‌రించింది. హైద‌రాబాద్ (Hyderabad) న‌గ‌రంలోనూ ఉరుములు, మెరుపుల‌తో కూడిన భారీ వ‌ర్షం కురిసే అవ‌కాశం ఉంద‌ని తెలిపింది. ప్ర‌జ‌లు వాతావరణ శాఖ జారీ చేసే హెచ్చరికలను గమనిస్తూ తగిన చర్యలు తీసుకోవాలని సూచించింది.

ఇవి కూడా చదవండి :

Music Mapping Neurosurgery : వండర్..గీటార్ వాయిస్తుండగానే బ్రెయిన్ ట్యూమర్ ఆపరేషన్ !
New Chief Secretary Race | తెలంగాణ తదుపరి సీఎస్‌ ఎవరో? రేస్‌లో ఐదుగురు ఐఏఎస్‌లు…