Python | కనిపించకుండా పోయిన మహిళ కోసం గాలింపు.. భారీ కొండచిలువ కడుపులో ప్రత్యక్షం..!

Python | ఇండోనేషియా రాజధాని జకర్తాలో దారుణం జరిగింది. ఇంటి నుంచి బయటకు వెళ్లిన కనిపించకుండాపోవడంతో కుటుంబసభ్యులు, బంధువులు చుట్టుపక్కల గాలించారు. చివరికి ఓ భారీ కొండ చిలువ కడుపులో ఆ మహిళను చూసి షాకయ్యారు. సదరు మహిళను కొండ చిలువ మింగి చంపేసింది. దాంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.

  • Publish Date - June 10, 2024 / 10:55 AM IST

Python : ఇండోనేషియా రాజధాని జకర్తాలో దారుణం జరిగింది. ఇంటి నుంచి బయటకు వెళ్లిన కనిపించకుండాపోవడంతో కుటుంబసభ్యులు, బంధువులు చుట్టుపక్కల గాలించారు. చివరికి ఓ భారీ కొండ చిలువ కడుపులో ఆ మహిళను చూసి షాకయ్యారు. సదరు మహిళను కొండ చిలువ మింగి చంపేసింది. దాంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.

వివరాల్లోకి వెళ్తే.. దక్షిణ సులాసి ప్రావిన్స్‌లోని కలెంపాగ్‌ గ్రామానికి చెందిన ఫరీదా (45) గురువారం కనిపించకుండా పోయింది. దాంతో ఆమె భర్త, కుటుంబసభ్యులు, బంధువులు చుట్టపక్కల గాలించారు. చివరికి ఊరి శివార్లలో ఒక ఐదు మీటర్ల పొడవున్న భారీ కొండచిలువను చూశారు. దాని కడుపు లావుగా ఉండటం చూసి అనుమానంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు.

దాంతో పోలీసులు, అటవీ అధికారులు ఘటనా ప్రాంతానికి చేరుకున్నారు. ఆలోపే స్థానికులు ఆ కొండ చిలువ దేహాన్ని కోయగా మహిళ మృతదేహం బయటపడింది. మహిళ కోసం గాలిస్తుండగా ఊరి శివార్లలో ఆమెకు సంబంధించిన కొన్ని వస్తువులు కనిపించాయని, దాంతో ఆ చుట్టుపక్కల వెతుకగా లావు కడుపుతో కొండ చిలువ కనిపించిందని, దాని కడుపు కోసి చూడగా మహిళ శవం బయటపడిందని స్థానికులు తెలిపారు.

కాగా, ఇండోనేషియాలో ఏటా ఇలాంటి ఘటనలు ఒకటి, రెండు చోటు చేసుకోవడం పరిపాటిగా మారింది. ఇది స్థానికుల్లో ఆందోళన కలిగిస్తున్నది.

Latest News