సత్య నాదేళ్ల సిఇఒ అయిన త‌ర్వాతే మైక్రోసాఫ్ట్ షేర్ పరుగులు

విధాత‌,అమెరికా:మైక్రోసాఫ్ట్‌ సిఇఒగా సత్య నాదేళ్ల బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆ కంపెనీ షేర్ పరుగులు పెడుతోంది.అదే విధంగా కంపెనీ విలువ అమాంతం పెరుగుతోంది.మంగళవారం న్యూయార్క్‌ స్టాక్‌ ఎక్స్చేంజిలో కంపెనీ షేర్ ధర 1.2 శాతం పెరగడంతో మైక్రోసాఫ్ట్‌ కాపిటలైజేషన్‌ విలువ రెండు ట్రిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.150 లక్షల కోట్లు)కు చేరింది. ముఖ్యంగా క్లౌడ్‌ కంప్యూటింగ్‌ వ్యాపారంలో అద్భుతమైన పురోభివృద్ధి సాధించడంతో కంపెనీ విలువ ఇటీవల గణనీయంగా పెరిగింది. 2014లో సత్యా నాదేళ్ల బాధ్యతలు చేపట్టే నాటికి […]

  • Publish Date - June 24, 2021 / 04:17 AM IST

విధాత‌,అమెరికా:మైక్రోసాఫ్ట్‌ సిఇఒగా సత్య నాదేళ్ల బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆ కంపెనీ షేర్ పరుగులు పెడుతోంది.అదే విధంగా కంపెనీ విలువ అమాంతం పెరుగుతోంది.మంగళవారం న్యూయార్క్‌ స్టాక్‌ ఎక్స్చేంజిలో కంపెనీ షేర్ ధర 1.2 శాతం పెరగడంతో మైక్రోసాఫ్ట్‌ కాపిటలైజేషన్‌ విలువ రెండు ట్రిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.150 లక్షల కోట్లు)కు చేరింది. ముఖ్యంగా క్లౌడ్‌ కంప్యూటింగ్‌ వ్యాపారంలో అద్భుతమైన పురోభివృద్ధి సాధించడంతో కంపెనీ విలువ ఇటీవల గణనీయంగా పెరిగింది. 2014లో సత్యా నాదేళ్ల బాధ్యతలు చేపట్టే నాటికి కంపెనీ విలువ 310 బిలియన్‌ డాలర్లుగా ఉండగా.. 2019 నాటికి ట్రిలియన్‌ డాలర్లకు (రూ.75 లక్షల కోట్లు)కు చేర్చారు. ఆ తర్వాత రెండేళ్లలోనే మరో ట్రిలియన్‌ డాలర్ల సంపదను జోడించారు. గతేడాది 24 శాతం వృద్థిని నమోదు చేసింది.

Readmore:భారీ ప్రాజెక్ట్‌ను వదులుకున్న సమంత

Latest News