ప్రకృతి వింత…బంగారు తల అరుదైన కోతులు

వియత్నాంలోని కాట్ బా దీవిలో మాత్రమే కనిపించే బంగారు తల లంగూర్ ప్రపంచంలోనే అత్యంత అరుదైన కోతి జాతి. ప్రస్తుతం వీటి సంఖ్య కేవలం 30 మాత్రమే ఉంది.

ప్రకృతిలో భూమిపైన, సముద్రాలలో సంచరించే జీవ జాతులలో, గగన విహారం చేసే పక్షులలో ఎన్నో రకాల జాతులు..విభిన్నమైన ప్రత్యేకతలు, వింతల విశేషాలతో తమ మనుగడ సాగిస్తుంటాయి. అయితే ప్రపంచంలోనే అత్యంత అరుదైన వానర జాతుల్లో ఒకటైన “బంగారు తల లంగూర్” కోతులు మరింత ప్రత్యేకంగా నిలిచాయి. ఈ జాతి వియత్నాంలోని కాట్ బా దీవిలో తప్ప..ప్రపంచంలో మరెక్కెడ కనిపించదు. పరిమితమైంది.ప్రపంచంలోని అత్యంత అరుదైన జాతిగా ఇది పరిగణించ బడుతోంది.ప్రస్తుతం వియత్నాం ప్రభుత్వం క్యాట్ బా నేషనల్ పార్క్ ద్వారా వీటిని ప్రత్యేకంగా సంరక్షిస్తోంది.ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వీటి సంఖ్య కేవలం 30 వరకు గా మాత్రమే ఉందని అంచనా. ఆసియాలోనే అత్యంత అరుదైన కోతి జాతిగా దీనిని పరిగణిస్తారు.

భారతదేశంలోని అస్సాం, భూటాన్ సరిహద్దుల్లో కనిపించే గోల్డెన్ లంగూర్ జాతి వానరాలు.. వియత్నాంలోని కాట్ బా దీవి “బంగారు తల లంగూర్” జాతి వానరాలు రెండు వేర్వేరు జాతులు. అరుదైన అంతరించిపోతున్న ప్రైమేట్ (కోతి) జాతులలో ఒకటైన “బంగారు తల లంగూర్” కోతుల శాస్రీయ నామం ట్రాకిపిథెకస్ పోలియోసెఫాలస్(Trachypithecus poliocephalus).ఇవి ప్రధానంగా సున్నపురాయి కొండలు,దట్టమైన అటవీ ప్రాంతాలలో, కొండ గుహలలో నివసించడానికి ఇష్టపడతాయి.పుట్టినప్పుడు ఈ కోతి పిల్లలు పూర్తిగా ప్రకాశవంతమైన నారింజ (Orange) రంగులో ఉండి, పెద్దవవుతున్న కొద్దీ రంగు మారుతాయి. బంగారు తల లంగూర్ కోతుల శరీరం నలుపు లేదా ముదురు గోధుమ రంగులో ఉంటుంది. కానీ వీటి తల, మెడ భాగాలు ప్రకాశవంతమైన బంగారు లేదా పసుపు రంగు బొచ్చుతో కప్పబడి ఉంటాయి. అందుకే వీటిని “బంగారు తల లంగూర్” అంటారు. వీటి శరీర పరిమాణం కంటే చాలా పొడవైన తోకను కలిగి ఉంటాయి. చెట్లపై సమతుల్యత, పట్టుకు కాపాడుకోవడానికి ఈ తోక సహాయపడుతుంది.ఇవి పూర్తిగా శాఖాహారులు.

Latest News