Zealandia continent | సముద్రాలు, మహాసముద్రాలు అంతులేని రహస్యాలకు నిలయాలు! అందులో ఏముందో పూర్తిగా ఎవరికీ తెలియదు! ఆ అన్వేషణ సాగుతున్న కొద్దీ.. కొత్త కొత్త రహస్యాలు బయటపడుతున్నాయి. ఇప్పుడు అలాంటిదే ఒక భారీ రహస్యాన్ని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అది.. దక్షిణ పసిఫిక్ మహా సముద్ర నీలిరంగు జలాల కింద దాగి ఉన్నది. అదే జిలాండియా! దాదాపు 51 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో నీటి కింద ఆ ఎనిమిదో ఖండం మునిగిపోయి ఉన్నది. దాని ఉపరితలంలో 5 శాతం మాత్రమే సమద్ర మట్టానికి పైన కనిపిస్తూ ఉండే ఈ భూభాగం.. ఎనిమిదో ఖండం అయి ఉంటుందన్న విషయంలో చర్చను రేకెత్తిస్తున్నది. భూమికి సంబంధించిన అత్యంత అస్పష్టమైన భూరూపాల్లో ఒకటిగా శాస్త్రవేత్తలు దీనిని భావిస్తున్నారు.
ఇది కూడా చదవండి..
ధరిత్రిపై ఏకైక అతిపెద్ద మహావరద! ఎప్పుడు.. ఎక్కడ? పరిశోధకులు ఏమంటున్నారు?
జీలాండియా మొదటి నుంచీ సముద్రంలో ఉన్నది కాదు. ఈ కథ.. దాదాపు వంద మిలియన్ సంవత్సరాల క్రితం మొదలైంది. దక్షిణాది సూపర్‌కాంటినెంట్ గోండ్వానాలో భాగంగా అప్పుడు ఇది ఉండేది. గోండ్వానా అనే సూపర్‌కాంటినెంట్ భాగాలుగా విడిపోయి ఆఫ్రికా, దక్షిణ అమెరికా, అంటార్కిటికా, ఆస్ట్రేలియా, భారత ఉపఖండం ఏర్పడ్డాయి. గోండ్వానా మెల్లగా విడిపోతున్న సమయంలోనే జీలాండియా కూడా తన సొంత ప్రయాణం మొదలు పెట్టిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సుమారు 85 మిలియన్ సంవత్సరాల క్రితం దక్షిణ భాగం విడిపోయింది. అదే ఇప్పుడు అంటార్కిటికాగా మారింది. తర్వాత 25 మిలియన్ సంవత్సరాలకు గోండ్వానా ఉత్తర భాగం విడిపోయి, ఆస్ట్రేలియా ఖండంగా అవతరించింది. ఈ కదలికలు తన పొరుగు ఖండాల నుంచి జీలాండియాను దూరంగటా నెట్టేశాయి. ఫలితంగా అది నిశ్భబ్దంగా సముద్ర జలాల్లోకి జారిపోయింది. ఇతర ఖండాల మాదిరిగా నీటిపైభాగాన ఉండలేక పోయింది. ఈ భూమిపై భారీ క్షీరదాలు నడయాడిని కాలంలో దీని బిరుసుదనం క్షీణించిపోయి, చల్లగా తయారైంది. ఆ మార్పుతో అది క్రమంగా మునిగిపోవడం ప్రారంభమైంది. ఇప్పుడు న్యూజీలాండ్, న్యూ కలెడోనియా మాత్రమే నీటికి ఎగువన ఉండటంతో వాటి కింద భారీ భూభాగం ఉన్నదని శాస్త్రవేత్తలు అంచనాకు వచ్చారు. ఒక టెక్టానిక్ సరిహద్దు ఇప్పుడు జిలాండియాను ఉత్తర, దక్షిణ భాగాలుగా విభజిస్తుంది. పసిఫిక్, ఆస్ట్రేలియన్ ప్లేట్ల జాడలు కలిగి ఉంటుంది.
ఇది కూడా చదవండి..
అరుదైన ఉల్కను.. 80 ఏళ్లు ఇంటి ముందు మెట్టుగా వాడేసిన రైతు! విలువ తెలుసుకుని షాక్
భూమిలో కుంగిపోయిన మరో ఖండం ఉందనే ఆలోచన శాస్త్రవేత్తలో దశాబ్దాల క్రితమే వచ్చినా.. అందుకు శాస్త్రీయ మద్దతు సాధించడం కోసం శాస్త్రవేత్తలు తీవ్రంగా శ్రమించారు. అయితే.. తాజా ఆవిష్కరణలు దానిని పూర్తిగా మార్చివేశాయి. కొత్త వివరాలు, అధునాతన పరికరాల సహాయంతో పరిశోధకులు ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుని జీలాండియా భౌగోళిక గుర్తింపును పునర్మూల్యాంకనం చేస్తున్నారు. టెక్టానిక్స్‌లో జీఎన్‌ఎస్ సైన్స్‌కు చెందిన జియాలజిస్ట్ నిక్ మార్టైమర్ నేతృత్వంలోని ఆయన టీమ్ ప్రచురించిన ఒక అధ్యయనంతో గొప్ప ముందడుగు పడింది. జీలాండియా ఖండమే అనేందుకు బలమైన ఆధారాలను వారి అధ్యయనంలో కనుగొనడం ద్వారా ఈ కుంగిపోయిన ప్రపంచంపై మళ్లీ శాస్త్రవేత్తల స్పాట్‌లైట్ పడింది. మార్టైమ్ నేతృత్వంలోని శాస్త్రవేత్తల బృందం ఉత్తర జీలాండియా వ్యాపించిన ప్రాంతాల్లో ఆధునిక డ్రెడ్జింగ్ సాంకేతికతలు వాడి తవ్వకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారికి ఫెయిర్‌వే రిడ్జ్ నుంచి కోరల్ సీ వరకూ రాళ్ల నమూనాలు, ఇసుక రాళ్లు, మట్టి, లైమ్‌స్టోన్, అగ్గిరాయి, నల్లపింగాణిగా పిలిచే బసాల్టిక్ లావా వంటి అనేకం సేకరించారు. ఇవి జీలాండియా జియోలాజికల్ టైమ్‌లైన్‌కు సంబంధించిన కీలక అంశాలను అందించాయి. వీటిని శాస్త్రీయంగా పరిశీలించగా.. సుమారు 95 మిలియన్ సంవత్సరాల క్రితానివని తేలింది. ఈ పరిశోధన భూమిలోని టెక్టానిక్ ప్లేట్ల హిస్టరీని అధ్యయనం చేసేందుకు ఉపకరిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి
మీరు నమ్మలేరు.. రెండు ముక్కలుగా చీలనున్న భారతదేశం!
sleep divorce : ఆలుమగల మధ్య స్లీప్ డివోర్స్? ఇదేంటిది.. కొత్తగా!