విధాత: అట్లాంటిక్ సముద్రంలో మునిగిపోయిన టైటానిక్ ఓడను చూసేందుకు ఐదుగురితో వెళ్లిన టైటాన్ (Titan) అనే సబ్మేర్సిబుల్ సముద్ర గర్భంలోని ఒత్తిడి తట్టుకోలేక పేలిపోయి ఉంటుందని అనుమానించిన నిపుణుల మాట నిజమైంది. నిర్మాణ తీరులో లోపాలు, సముద్రగర్భంలోని ఒత్తిడి తాళలేక అది పేలిపోయింది. అపరిమితమైన అట్లాంటిక్ మహాసముద్రంలో దాని జాడ కనిపెట్టడం కష్టమే … కానీ మొత్తానికి అమెరికా ఫ్రాన్స్, కెనడా రష్యా బృందాలు సముద్రాన్ని జల్లెడ పట్టాయి. ‘టైటానిక్’ ఓడ పక్కనే సముద్రం అట్టడుగున నేలపై […]
విధాత: అట్లాంటిక్ సముద్రంలో మునిగిపోయిన టైటానిక్ ఓడను చూసేందుకు ఐదుగురితో వెళ్లిన టైటాన్ (Titan) అనే సబ్మేర్సిబుల్ సముద్ర గర్భంలోని ఒత్తిడి తట్టుకోలేక పేలిపోయి ఉంటుందని అనుమానించిన నిపుణుల మాట నిజమైంది.
నిర్మాణ తీరులో లోపాలు, సముద్రగర్భంలోని ఒత్తిడి తాళలేక అది పేలిపోయింది. అపరిమితమైన అట్లాంటిక్ మహాసముద్రంలో దాని జాడ కనిపెట్టడం కష్టమే … కానీ మొత్తానికి అమెరికా ఫ్రాన్స్, కెనడా రష్యా బృందాలు సముద్రాన్ని జల్లెడ పట్టాయి.
‘టైటానిక్’ ఓడ పక్కనే సముద్రం అట్టడుగున నేలపై పడివున్న ‘ఓషన్ గేట్ ఎక్స్‌పెడిషన్స్’ సంస్థ సబ్మెర్సిబుల్ ‘టైటాన్’ శకలాలను గుర్తించారు. ఈ ముక్కలు చెక్కలను అమెరికా తీర రక్షక దళం ఎట్టకేలకు వెలికితీసింది.
వస్తావా నికి సముద్రంలో ఎక్కువ లోతుకు వెళ్లేకొద్దీ పీడనం పెరుగుతుంటుంది. ‘టైటాన్’ అధిక లోతును చేరాక దాని లోపలి పీడనం కంటే బయటి సముద్ర జల పీడనం ఎక్కువైంది. తీవ్ర నీటి ఒత్తిడితో ‘టైటాన్’ను డబ్బా మాదిరి నొక్కి నలిపేసిన సముద్రం.
ఫలితంగా ‘టైటాన్’లో అంతర్గత విస్ఫోటనం సంభవించి ఐదుగురు ప్రయాణికులూ మరణించారు. ‘టైటాన్’ సబ్ లోపలి పీడనం తగ్గడం ఈ ప్రమాదానికి కారణం. ‘టైటాన్’ ప్రధాన భాగం (హల్) నిర్మాణ లోపాలు కూడా దుర్ఘటనకు కారణాలు కావచ్చు అని అంటున్నారు.
ఇక ఈ టైటాన్ టైటాన్ సబ్మెర్సిబుల్ (Titan submersible) శకలాలు నిన్ననే నిపుణులు ఏరి ఒడ్డుకు చేర్చారు. ఒడ్డుకు చేరాయి. వాటిలో మానవ అవశేషాలను అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. కెనడాలోని న్యూఫౌండ్ లాండ్ అండ్ లాబ్రడార్ ప్రావిన్సులో సెయింట్ జాన్స్ ఓడరేవుకు బుధవారం వాటిని తీసుకొచ్చినట్లు యూఎస్ తీర రక్షణ దళం (US Coast Guard) అధికారులు వెల్లడించారు.
వాస్తవానికి వందేళ్ల క్రిందట అట్లాంటిక్ సముద్రంలో మునిగిపోయిన టైటానిక్ నౌక శకలాలను ప్రజలకు చూపేందుకు ఓషన్ గేట్ ఎక్స్ పిడీషన్స్ అనే సంస్థ ఈ సాహసయాత్రను నిర్వహిస్తోంది. ఇలా వెళ్లిన టైటాన్ అని మినీ సబ్ మెరైన్ పేలిపోయి ఐదుగురు మరణించారు.