Skydiver Left Dangling : విమానానికి వేలాడిన స్కై డైవర్ ..ప్రమాద ఘటన వైరల్

ఆస్ట్రేలియాలో స్కైడైవర్ విమానం తోక భాగానికి వేలాడిన ఘటన వీడియో వైరల్. పారాచూట్ చిక్కుకుపోయినా రెండో పారాచూట్‌తో సురక్షితంగా బయటపడ్డాడు.

Skydiver Left Dangling

విధాత : స్కై డైవ్ చేసేందుకు ఓ వ్యక్తి చేసిన ప్రయత్నం అతడికి గాలిలోనే ప్రాణ భయాన్ని చూపించింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింటా వైరల్ గా మారింది. ఆస్ట్రేలియాలో స్కై డైవ్‌ చేసేందుకు సిద్ధమైన ఓ వ్యక్తి పారాచూట్ తో సహా విమానం వెనక భాగంలో చిక్కుకుని చాలసేపు గాలిలోనే వేలాడాల్సి వచ్చింది. 15వేల అడుగుల ఎత్తు నుంచి స్కై డైవింగ్‌ చేసేందుకు కొందరు వ్యక్తులు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో ఓ స్కై డైవర్ పారాచూట్ సహాయంతో విమానం నుంచి బయటకు దూకే ప్రయత్నం చేస్తుండగానే..గట్టిగా వీచిన గాలితో పారాచూట్ తెరుచుకుని అది విమానం తోక భాగంలో చిక్కుకుంది. దీంతో స్కైడైవర్ చాల సేపు గాలిలో వేలాడుతూ ప్రమాదాన్ని తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. చివరకు తన వద్ద ఉన్న రెండో పారాచూట్ విప్పడం ద్వారా స్కై డైవర్ సురక్షితంగా కిందకు దిగాడు. ఆ వెంటనే పైలట్ కూడా విమానాన్ని సేఫ్ ల్యాండ్ చేశాడు.

దక్షిణ కెయిర్న్స్ లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఈ ఘటనలో స్కైడైవర్‌కు ఎలాంటి ప్రమాదం జరగలేదని, సురక్షితంగా బయటపడ్డాడని అధికారులు వెల్లడించారు. ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. ఈ ప్రమాదంలో పారచూట్ ధ్వంసమైనా..రెండో పారాచూట్ లేకపోయిన స్కై డైవర్ కిందపడి ప్రాణాలు కోల్పోయేవాడని..అదే సమయంలో విమానం సైతం ప్రమాదానికి గురి కాకుండా ఉండటం మరో కీలక అంశమని ఏరోనాటిక్ నిపుణులు అభిప్రాయపడ్డారు.

ఇవి కూడా చదవండి :

akhanda-2 | ఆఖండ 2 సినిమా నిర్మాతలపై హైకోర్టు ఆగ్రహం
Pawan Kalyan| ఢిల్లీ హైకోర్టుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

Latest News