Site icon vidhaatha

Archana: పెళ్లైన శివాజీతో బోల్డ్ సీన్స్ చేసిన ఫీలింగ్స్ రాలేదు.. హీరోయిన్ షాకింగ్ కామెంట్స్

Archana: న‌టి అర్చ‌న గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. అర్చన.. అర్చు.. అర్చన శాస్త్రీ.. వేద.. ఇలా అనేక పేర్ల‌తో ఈ అమ్మ‌డు పిల‌వ‌బ‌డుతుంటుంది. ప్రస్తుతం 42 ఏళ్ల వయసు ఉన్న ఈ ముద్దుగుమ్మ త‌ప‌న అనే సినిమాతో టాలీవుడ్ ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టింది. ఇక అదే ఏడాది అల్లరి నరేష్ హీరోగా చేసిన నేను అనే సినిమాతో హీరోయిన్ గా మారిపోయి ఫుల్ క్రేజ్ ద‌క్కించుకుంది. కొంచెం టచ్ లో ఉంటే చెబుతా, సూర్యం వంటి సినిమాల్లోనూ మెరిసిన‌ప్ప‌టికీ పెద్ద‌గా గుర్తింపు రాలేదు. 2006లో నువ్వొస్తానంటే నేనొద్దంటానా అనే సినిమాలో త్రిష స్నేహితురాలు లల్లీగా కనిపించి ఓ రేంజ్ పాపులారిటీ ద‌క్కించుకుంది.. నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమా చేయడం వల్లే హీరోయిన్ గా తన కెరియర్ ఆగిపోయిందని ఓ సంద‌ర్భంలో చెప్పుకొచ్చింది.

నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమాలో తనకు కళ్లజోడు పెట్టడం చాలా మైన‌స్ అయింద‌ని పేర్కొంది. న‌టి అంటే క‌ళ్లు, హ‌వ‌భావాలు స‌రిగ్గా ప‌లికించాలి. క‌ళ్ల‌జోడు పెట్టుకోవడం వ‌ల‌న నాకు అది చాలా మైన‌స్ అయింది. నువ్వొస్తానంటే నేనొద్దాంటానా సినిమాతో అవ‌కాశాలు చాల త‌గ్గాయంటూ కూడా స్ప‌ష్టం చేసింది.ఇటీవ‌ల శివాజీ నటించిన 90s మిడిల్ క్లాస్ బయోపిక్ అనే వెబ్ సిరీస్ లో నటించింది. అందులో మంచి మార్కులే కొట్టేసింది. అయితే రీసెంట్‌గా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న ఈ అమ్మ‌డు సినిమాల్లో రొమాంటిక్ సీన్స్ చేసేటప్పుడు మీరు కేవలం నటనగానే భావిస్తారా లేక ఫీల్ తో చేస్తారా అని యాంక‌ర్ ప్ర‌శ్నించింది. దానికి అర్చ‌న బ‌దులిస్తూ సెట్స్ లో చాలా మంది ఉంటారు. ఫీల్ అయ్యేయంత ఏమి ఉండ‌దు.

నేనైతే హీరోతో రొమాన్స్ చేసేటప్పుడు.. ఆయన ఒక వస్తువు.. నేనొక వస్తువు అని మాత్రమే భావిస్తాను. శివాజితో కమలతో నా ప్రయాణం చిత్రంలో అర్చన చాలా బోల్డ్ సీన్స్ చేయ‌గా, ఆ స‌మ‌యంలో శివాజితో బోల్డ్ సీన్స్ ముందే ప్రాక్టీస్ చేసేదాన్ని. ఒక టేక్‌లో కంప్లీట్ కావాలి కాబ‌ట్టి ఇద్ద‌రం ఎలా చేయాల‌ని మాట్లాడుకొని చేసేవాళ్లం. ఆ సినిమాలో అన్ని బోల్డ్ సీన్స్ సింగిల్ టేక్ లో అయ్యాయి. శివాజీ ఆల్రెడీ పెళ్ళైన వ్యక్తి కాబ‌ట్టి ఆయనతో రొమాన్స్ చేస్తే నాకు ఫీలింగ్స్ వ‌చ్చేవి కాదు. నాకు ఎవరైనా నచ్చి రొమాన్స్ చేస్తే అది వేరే విషయం. శివాజీ పెళ్ళైన వ్యక్తి..ఆయన నా కోస్టార్ కానీ నాతో సంబంధం ఉన్న వ్యక్తి కాదు కాబ‌ట్టి ఎలాంటి ఫీలింగ్స్ ఉండేవి కావంటూ చెప్పుకొచ్చింది అర్చ‌న‌.

Exit mobile version