Balakrishna| ‘వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్’లో హీరో బాలకృష్ణ

విధాత : సీనియర్ హీరో, హిందుపురం టీడీపీ ఎమ్మెల్యే, పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna)కు అరుదైన ‘వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్'( World Book of Records)లో స్థానం దక్కింది. భారతీయ సినిమా(Indian Cinema)లో హీరోగా 50 సంవత్సరాలు(50 years cinema) పూర్తి చేసుకున్నందుకు నందమూరి బాలకృష్ణను యూకేలోని వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ గోల్డ్ ఎడిషన్ గుర్తింపుతో సత్కరించింది. భారతీయ సినిమాలో ఈ గుర్తింపును అందుకున్న మొదటి నటుడు బాలకృష్ణ కావడం విశేషం. హీరోగా బాలకృష్ణ 50ఏళ్ల […]

విధాత : సీనియర్ హీరో, హిందుపురం టీడీపీ ఎమ్మెల్యే, పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna)కు అరుదైన ‘వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్'( World Book of Records)లో స్థానం దక్కింది. భారతీయ సినిమా(Indian Cinema)లో హీరోగా 50 సంవత్సరాలు(50 years cinema) పూర్తి చేసుకున్నందుకు నందమూరి బాలకృష్ణను యూకేలోని వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ గోల్డ్ ఎడిషన్ గుర్తింపుతో సత్కరించింది. భారతీయ సినిమాలో ఈ గుర్తింపును అందుకున్న మొదటి నటుడు బాలకృష్ణ కావడం విశేషం. హీరోగా బాలకృష్ణ 50ఏళ్ల సినీ ప్రస్థానంతో పాటు బసవతారకం ట్రస్టు క్యాన్సర్ ఆసుపత్రి ద్వారా అందిస్తున్న ఆయన సేవలు సమాజానికి స్ఫూర్తిదాయకమైనవని ఈ సందర్భంగా ‘వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్’ ప్రశంసించింది.

సినీ, సాంస్కృతిక, ప్రజా, సేవా రంగాల్లో బాలకృష్ణ అందించిన సేవలను కొనియాడింది. భవిష్యత్తులో బాలకృష్ణ ప్రపంచ వ్యాప్తంగా మరింత గుర్తింపునందుకోవాలని ఆకాంక్షించింది. ‘వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్’ సెక్రటరీ సంతోష్ శుక్లా ఆయనకు గుర్తింపు పత్రాన్ని అందచేశారు.
‘వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్’లో హీరో బాలకృష్ణకు గుర్తింపు దక్కడంతో ఆయన అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.