భారీ పొట్టతో మొసలి..కోసి చూస్తే షాకింగ్..!

అదృశ్యమైన వ్యక్తి ఆచూకీ నది ఒడ్డున సేద తీరుతున్న ఓ భారీ మొసలి పొట్టలో కనిపించడంతో అంతా షాక్ గురయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

అదృశ్యమైన వ్యక్తి ఆచూకీ నది ఒడ్డున సేద తీరుతున్న ఓ భారీ మొసలి పొట్టలో కనిపించడంతో అంతా షాక్ గురయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. దక్షిణాఫ్రికాలో కోమటిపోర్ట్ సమీపంలో కోమటి నది వద్ద తప్పిపోయిన 59 ఏళ్ల గౌటెంగ్ అనే వ్యాపారవేత్తకోసం పోలీసులు గాలిస్తుండగా, నది ఒడ్డున ఎండలో సేదతీరుతున్న ఒక భారీకాయ మొసలి వారికి కనిపించింది.

భారీ పొట్టతో ఉన్న ఆ మొసలి వాలకంపై అనుమానం వచ్చి దానిని బంధించి చంపి, కోసి చూడగా ఆ వ్యక్తి శరీర భాగాలు బయటపడ్డాయి. అంతేకాదు ఆ మొసలి కడుపులో ఇతర వ్యక్తులకు చెందిన బోలెడన్ని బూట్లు, క్రోక్స్ సహా పలు వస్తువులు లభ్యమవ్వడంలో సిబ్బంది షాక్ కు గురయ్యారు. నదిలోని ప్రవాహాల మధ్య ఒక పల్లపు వంతెనపై వ్యాపారవేత్త వాహనం చిక్కుకుపోవడంతో భద్రతా సిబ్బంది అతడి ఆచూకీ కోసం వెతకారు. ఆ వ్యక్తిని మొసలి మింగేసినట్లుగా గుర్తించారు. అలాగే గతంలోనూ ఆ మొసలి పలువురిపై దాడి చేసినట్లుగా దాని పొట్టలోని అవశేషాలు వెల్లడిస్తున్నాయి. దీంతో అసలు మొసలి మనుషులను వేటాడిందా..లేక మనుషులే దాని ఆవాసంలోకి వెళ్లి ఆహారంగా మారిపోయారా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి :

సముద్రంలో శివలింగం ప్రత్యక్షం ..!
Viral Video | తలలో కత్తి దిగినా తాపీగా ఫోన్ చూసుకుంటూ హాస్పిటల్‌కు వచ్చిన యువకుడు.. వీడియో వైరల్

Latest News