మహిళా పోలీస్ అధికారిణికి తప్పని వేధింపులు..ఏం జరుగుతుందీ..?

ఆమె ఓ పేరుమోసిన మహిళా ఐపీఎస్ అధికారిణి. ఆమెకు కూడా ఆకతాయిలు, పోకిరీల వేధింపులు తప్పలేదు. ఖాకీ యూనీఫామ్ లేకుండా సాధారణ దుస్తుల్లో సామాన్య మహిళగా అర్థరాత్రి రోడ్డుపై బస్టాండ్ లో నిల్చున్న మల్కజ్ గిరి సీపీ సుమతికి పోకిరీల వేధింపుల అనుభవం ఎదురైంది.

ఆమె ఓ పేరుమోసిన మహిళా ఐపీఎస్ అధికారిణి. ఆమెకు కూడా ఆకతాయిలు, పోకిరీల వేధింపులు తప్పలేదు. మల్కాజ్‌గిరి సీపీగా బాధ్యతలు చేపట్టిన సుమతి తొలి రోజునే మహిళల భద్రత , సమస్యలపై ఫోకస్ పెట్టారు. అండర్ కవర్ ఆపరేషన్ చేపట్టారు. ఖాకీ యూనీఫామ్ లేకుండా సాధారణ దుస్తుల్లో సామాన్య మహిళగా అర్థరాత్రి రోడ్డుపై బస్టాండ్ లో నిల్చున్నారు. ఆమెను సీపీ సుమతి అని గుర్తుపట్టని పోకిరీలు ఆమె చుట్టు చేరి రకరకాల కామెంట్స్ తో వేధించారు. ఆమెను వేధింపులకు గురి చేసిన వారిలో విద్యార్థులు ఎక్కువ మంది ఉండటం గమనార్హం. ఆమె ఎవరో తెలియక కొందరు పోకిరీలు ఆమెను చుట్టుముట్టి వస్తావా? నీ రేటు ఎంత? ఎంతివ్వాలంటూ అంటూ వెకిలి ప్రశ్నలు వేశారు.

ఆపరేషన్ లో భాగంగా పోకిరీలను అదుపులోకి తీసుకుని..వారి పెద్దలను సైతం పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు. మరోసారి రీపిట్ అయితే పోలీస్ మర్యాదలు చేయాల్సి వస్తుందంటూ వార్నింగ్ ఇచ్చి…మహిళల భద్రతకు సంబంధించిన చట్టాలపై వారికి అవగాహాన కల్పించి పంపించారు. సాధారణ మహిళగా సీపీ సుమతి వేసిన నిఘా వలకు ఒకే విడతలో 40మంది చిక్కిన తీరు చూస్తిన కొందరు నెటిజన్లు ఆమె ప్రయత్నాన్ని అభినందించారు. మరికొందరు మాత్రం సాధారణ మహిళగా సీపీ సుమతికి ఎదురైన అనుభవం చూస్తే.. నగరంలో మహిళల భద్రత ఏ స్థాయిలో ఉందోనంటూ ప్రశ్నలు సంధిస్తున్నారు.

 

ఇవి కూడా చదవండి :

UPSC Civil Services | హైద‌రాబాద్‌లో సివిల్ స‌ర్వీసెస్ అభ్య‌ర్థుల‌కు ఫ్రీ కోచింగ్.. అర్హులు వీరే..!
Mega Job Mela | హైద‌రాబాద్‌లో మే 9న మెగా జాబ్ మేళా..!

Latest News