Mega Job Mela | హైదరాబాద్‌లో మే 9న మెగా జాబ్ మేళా..!
Mega Job Mela | ఇంటర్, డిగ్రీ పాసై ప్రయివేటు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త. హైదరాబాద్ నాంపల్లిలోని రెడ్ రోజ్ ప్యాలెస్‌లో ఈ నెల 9వ తేదీన మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు.
Mega Job Mela | ఇంటర్, డిగ్రీ పాసై ప్రయివేటు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త. హైదరాబాద్ నాంపల్లిలోని రెడ్ రోజ్ ప్యాలెస్‌లో ఈ నెల 9వ తేదీన మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జాబ్ మేళా కొనసాగనుంది.
ఈ జాబ్ మేళాకు ఫార్మా, హెల్త్ కేర్, ఐటీ అండ్ ఐటీఈఎస్, ఎడ్యుకేషన్, బ్యాంకింగ్‌తో పాటు పలు రంగాలకు చెందిన కంపెనీలు రానున్నాయి. ఇందులో కొన్ని కంపెనీలు వర్క్ ఫ్రం హోం అవకాశం కూడా కల్పించనున్నాయి.
పదో తరగతి, ఇంటర్, డిగ్రీ పాసైన విద్యార్థులు జాబ్ మేళాకు హాజరు కావొచ్చు. అర్హతలను బట్టి అక్కడికక్కడే ఉద్యోగ, ఉపాధి అవకాశాలను పొందే అవకాశం ఉంది. మెగా జాబ్ మేళా వివరాల కోసం 8374315052 నంబర్‌ను సంప్రదించొచ్చు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram