Viral Video | ఆర్థిక రాజధాని ముంబైలో జరిగిన ఓ ఘటన సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. తలలో పెద్ద కత్తి దిగినప్పటికీ ఏమాత్రం కంగారు లేకుండా ఓ యువకుడు తాపీగా హాస్పిటల్‌కు వచ్చాడు. ఒక్కడే ఫోన్ చూసుకుంటూ ప్రశాంతంగా ఆస్పత్రికి వచ్చి చికిత్స చేయించుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో చూసి జనాలు ఆశ్చర్యపోతున్నారు. చిన్న గాయమైతేనే విలవిల్లాడిపోతాం.. అలాంటిది తలలో అంత పెద్ద కత్తి దిగినా అతను అంత కూల్‌గా ఎలా ఉండగలిగాడని చర్చించుకుంటున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధితుడి పేరు రోహిత్ నాగనాథ్ పవార్ (27). మే 1వ తేదీ రాత్రి 10.30 గంటల సమయంలో స్థానిక పీఎంజీ కాలానీలోని ఇర్ఫాన్ చికెన్ షాపు సమీపంలో అతనిపై దాడి జరిగింది. పాత కక్షల కారణంగా గౌతమ్ అనే యువకుడు తన ముగ్గురు మైనర్ స్నేహితులతో కలిసి రోహిత్‌పై కత్తులతో దాడి చేశాడు. “ఇవాళ నిన్ను అంతం చేస్తాం” అంటూ బెదిరిస్తూ రోహిత్‌పై వారు దాడి చేశారు. ఈ క్రమంలో ఓ మైనర్ కత్తితో రోహిత్ తలపై బలంగా దాడి చేశాడు. దీంతో రోహిత్ తల ఎడమ వైపున బలంగా ఇరుక్కుపోయింది. ఘటన అనంతరం గౌతమ్, అతని సహచరులు అక్కడి నుంచి పరారయ్యారు.
ప్రత్యర్థుల దాడిలో తీవ్రంగా గాయపడినప్పటికీ రోహిత్ స్పృహ కోల్పోలేదు. జరిగిన విషయాన్ని తన అన్న రాహుల్‌కు ఫోన్‌లో సమచారం అందించాడు. తీవ్ర రక్తస్రావమవుతున్నప్పటికీ చాలా ప్రశాంతంగా లోకమాన్య తిలక్ మున్సిపల్ జనరల్ ఆస్పత్రికి వచ్చాడు. తలలో కత్తి దిగి ఉండగానే నడుచుకుంటూ ఆస్పత్రిలోకి వెళ్లాడు. పైగా ఫోన్ చూసుకుంటూ.. ఎవరికో కాల్ చేసుకుంటూ అక్కడక్కడే తిరిగాడు. ఇది చూసిన అక్కడి వారు వీడియో తీసి సోషల్‌మీడియాలో పెట్టారు. ఆ వీడియో కాస్త ఇప్పుడు వైరల్‌గా మారింది. అలాంటి పరిస్థితుల్లో కూడా అతను ప్రశాంతంగా ఉండటం చూసి దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.
#BREAKING #SionHospital Shock: Man Found with Knife in Head Panic gripped #Mumbai’s Sion Hospital after a man appeared outside the ICU with a knife embedded in his head. Relatives allege medical delays. He remains in critical condition
#MumbaiPolice @MumbaiPolice @mybmc pic.twitter.com/VYmCwtDY42
— jarvis ☠️ (@Vishii14) May 4, 2026
ఇక రోహిత్ ఆస్పత్రికి చేరుకున్నప్పుడు స్పృహలోనే ఉండటమే కాకుండా ఎలాంటి నాడీ సంబంధిత లోపాలు కనిపించలేదని వైద్యులు తెలిపారు. తలలో కత్తి సుమారు 1.5 అంగుళాల లోతుకు మెదడులోకి వెళ్లినట్లుగా స్కానింగ్‌లో తెలిసిందని పేర్కొన్నారు. దీంతో వెంటనే ఆపరేషన్ చేసి కత్తిని సురక్షితంగా తొలగించినట్లు చెప్పారు. ప్రస్తుతం రోహిత్ ట్రామా ఐసీయూలో ఉన్నాడని.. అతని ఆరోగ్యం స్థిరంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఘటనాస్థలిలోని సీసీ కెమెరాలను పరిశీలించి ముగ్గురు మైనర్లను అదుపులోకి తీసుకున్నారు.
Read More:
మూడు నెలల కిందట కోమాలోకి.. మ్యారేజ్‌కు రెండు రోజుల ముందే స్పృహలోకి వచ్చిన పెళ్లి కూతురు!
తాత జీవితాన్ని మార్చేసిన డయాబెటిస్.. 65 ఏళ్ల వయసులో మారథాన్ ఛాంపియన్‌గా ఎదిగిన మహిపాల్ సింగ్!
