UPSC Civil Services | తెలంగాణ రాష్ట్రం నుంచి ప్రతి ఏడాది యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పోస్టులకు మెజార్టీగా ఎంపికవుతున్న సంగతి తెలిసిందే. ఈ సివిల్ సర్వీసెస్ ఉద్యోగాలకు ప్రిపేరయ్యే అభ్యర్థుల సంఖ్య కూడా పెరిగిపోతూనే ఉంది. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ స్టడీ సర్కిళ్ల ద్వారా ఉచితంగా కోచింగ్ అందజేస్తున్నారు.
తాజాగా తెలంగాణ మైనార్టీస్ స్టడీ సర్కిల్ అండ్ కెరీర్ కౌన్సెలింగ్ సెంటర్ (TGMSC&CCC) మైనార్టీ కమ్యూనిటీ అభ్యర్థులకు యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్‌కు సంబంధించి ఫ్రీ కోచింగ్ ఇచ్చేందుకు ప్రకటన జారీ చేసింది. అర్హులైన అభ్యర్థులు మే 7 నుంచి మే 31వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
అర్హత : డిగ్రీ తప్పనిసరి
అర్హులు ఎవరంటే..?
ముస్లిం, క్రిస్టియన్, సిఖ్, జైన్, బుద్దిస్ట్, పార్శి మతాలకు చెందిన వారు.
సదుపాయాలివే..
డిజిటల్ క్లాస్ రూమ్‌లు, లైబ్రరీ, ఇంటర్నెట్, ఉచిత వైఫై, వసతి
దరఖాస్తులు స్వీకరణ : మే 7 నుంచి మే 31 వరకు
రాత పరీక్ష : జూన్ 14
దరఖాస్తుల సమర్పణకు ఈ వెబ్‌సైట్‌ను క్లిక్ చేయండి.. https://cet.cgg.gov.in/tmreis/
