హోటల్ వంట గదిలోకి మొసలి.. వింత ఘటన!

నదులు, సరస్సులలో ఉండాల్సిన ఓ మొసలి లగ్జరీ హోటల్ వంట గదిలో ప్రత్యక్షమవ్వడం అందరిని ఆశ్చర్యపరిచింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

విధాత : నదులు, సరస్సులలో ఉండాల్సిన ఓ మొసలి లగ్జరీ హోటల్ వంట గదిలో ప్రత్యక్షమవ్వడం అందరిని ఆశ్చర్యపరిచింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. జింబాబ్వేలోని ప్రసిద్ధ విక్టోరియా జలపాతం సమీపంలో ఉన్న ఒక హోటల్‌లో తెల్లవారుజామున ఒక భారీ మొసలి ప్రత్యక్షమై అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అది నేరుగా అజాంబెజీ రివర్ లాడ్జ్ హోటల్ వంటగదిలోకి చొరబడటంతో సిబ్బంది ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. మొసలి హోటల్ ఫ్లోరింగ్ మీదుగా పాకడమేకాదు..ఏకంగా కిచెన్ ప్లాట్ ఫామ్ పైకి ఎక్కడం ఈ వీడియోలో కనిపించింది.

మొసలిని గమనించిన హోటల్ సిబ్బంది, యాజమాన్యం వెంటనే అప్రమత్తమై అధికారులకు సమాచారం అందించారు. రెస్క్యూ టీమ్ వెంటనే హోటల్ కు చేరుకుని ఆ మొసలిని సురక్షితంగా పట్టుకుని తిరిగి అడవిలోని జాంబెజీ నదిలోకి వదిలిపెట్టారు.

ఈ పర్యాటక ప్రాంతంలోని హోటల్స్ .. మొసళ్లు అధికంగా ఉండే నదికి సరిహద్దుగా ఉండటంతో తరచూ ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయని అటవీ అధికారులు చెబుతున్నారు.  నదికి చాలా దగ్గరగా రిసార్టులు హోటల్స్ ఉండటం, ఆహారం వాసనకు మొసళ్లు ఆకర్షితమవ్వడం, వర్షాకాలంలో నీటి మట్టం పెరగడంతో పరివాహక ప్రాంతాల నుంచి మొసళ్లు మైదానంలోకి వస్తుండటంతో ఈ సమస్యలు నెలకొంటున్నాయని విశ్లేషిస్తున్నారు.

 

ఇవి కూడా చదవండి :

రాజ్యసభలో 113 కు పెరిగిన బీజేపీ సంఖ్యా బలం
వన్స్ మోర్ రింకూ.. కాబోయే భార్య ఎంపీ ప్రియా సరోజ్ కేకలు!

Latest News