వన్స్ మోర్ రింకూ.. కాబోయే భార్య ఎంపీ ప్రియా సరోజ్ కేకలు!

ఐపీఎల్ –2026 టోర్నీలో ఎల్ఎస్జీ(LSG)పై కేకేఆర్(KKR) విజయంలో బ్యాటర్ రింకూ సింగ్ తన ధనాధన్ బ్యటింగ్ తో ప్రధాన పాత్ర పోషించాడు. రింకూ సిక్సులు, ఫోర్లు బాదుతుంటే...స్టేడియంలో ఉండి మ్యాచ్ చూసిన కాబోయే భార్య ఎంపీ ప్రియా సరోజ్ వన్స్ మోర్ అంటూ కేకలు వేసిన వీడియో వైరల్ గా మారింది.

వన్స్ మోర్ రింకూ.. కాబోయే భార్య ఎంపీ ప్రియా సరోజ్ కేకలు!

హైదరాబాద్ : ఐపీఎల్ –2026 టోర్నీలో ఎల్ఎస్జీ(LSG)పై కేకేఆర్(KKR) విజయంలో కీలక భూమిక పోషించిన బ్యాటర్ రింకూ సింగ్ షాట్లు కొడుతుంటే..ఆయన కాబోయే భార్య ఎంపీ ప్రియా సరోజ్ వన్స్ మోర్ అంటూ కేకలు వేసిన వీడియో వైరల్ గా మారింది. ఆదివారం రాత్రి లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగిన మ్యాచ్ లో ఓ దశలో 10ఓవర్లలో 6వికెట్లు కోల్పోయి 63పరుగులు చేసిన కేకేఆర్ ను రింకూసింగ్ తన ధనాధన్ బ్యాటింగ్ తో ఆదుకున్నాడు.  51బంతుల్లో 5సిక్సులు, 7ఫోర్లతో అజేయంగా 83పరుగులు చేసి జట్టుకు 155 పరుగుల గౌరవ ప్రదమైన స్కోర్ ను అందించాడు. చివరి ఓవర్ లో రింకూసింగ్ వరుసగా నాలుగు సిక్సర్లు బాదాడు.

రింకూ భారీ షాట్లతో సిక్సులు, ఫోర్లు కొడుతుంటే..స్టేడియంలో మ్యాచ్ చూస్తున్న  కాబోయే భార్య ఎంపీ ప్రియా సరోజ్ వన్స్ మోర్ అంటూ కేకలు వేస్తూ..ఎగురుతూ తన సంతోషాన్ని వ్యక్తం చేసింది. కేకేఆర్ విజయంతో రింకూ ప్రధాన పాత్ర పోషించడం ఆనందంగా ఉందని, ఇది ఆయన తండ్రి చూసి ఉంటే ఇంకా సంతోషించే వారని పేర్కొంది. రింకూ సింగ్ తండ్రీ ఇటీవల అనారోగ్యంతో  కన్నుమూసిన  సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో రింకూసింగ్ నాలుగు క్యాచ్ లను కూడా పట్టడంతో పాటు సూపర్ ఓవర్ లో ఫోర్ కొట్టి జట్టుకు చిరస్మరణీయమైన విజయాన్ని అందించడం విశేషం.

 

ఇవి కూడా చదవండి :

రైలు నుంచి పడిపోయిన బాలుడు..చైన్ లాగినా ఆపని లోకో పైలట్
స్వల్పంగా పెరిగిన బంగారం..స్థిరంగా వెండి ధరలు