Mehreen Pirzada | చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న మెహ్రీన్ పిర్జాదా.. హిమాచల్‌లో ప్రైవేట్ వేడుక
Mehreen Pirzada | టాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ మెహ్రీన్ పిర్జాదా జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటూ తన వ్యక్తిగత జీవితంపై గోప్యత పాటించిన ఈ ముద్దుగుమ్మ, ఎటువంటి హడావుడి లేకుండా పెళ్లి చేసుకుని అభిమానులకు సడన్ సర్‌ప్రైజ్ ఇచ్చారు.
Mehreen Pirzada | టాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ మెహ్రీన్ పిర్జాదా జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటూ తన వ్యక్తిగత జీవితంపై గోప్యత పాటించిన ఈ ముద్దుగుమ్మ, ఎటువంటి హడావుడి లేకుండా పెళ్లి చేసుకుని అభిమానులకు సడన్ సర్‌ప్రైజ్ ఇచ్చారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా సోషల్ మీడియాలో పెళ్లి ఫోటోలు షేర్ చేస్తూ వెల్లడించడంతో ఒక్కసారిగా ఈ వార్త వైరల్ అయింది.
సమాచారం ప్రకారం, మెహ్రీన్ వివాహం ఏప్రిల్ 26, 2026న హిమాచల్ ప్రదేశ్‌లోని ఓ అందమైన రిసార్ట్‌లో అత్యంత సన్నిహితుల మధ్య జరిగింది. కుటుంబ సభ్యులు, కొద్దిమంది ఆత్మీయులు మాత్రమే ఈ వేడుకకు హాజరయ్యారు. ఈ వేడుక పూర్తిగా ప్రైవేట్‌గా నిర్వహించబడటం విశేషం. పెళ్లి ఫోటోలలో మెహ్రీన్ సంప్రదాయ వధువు వేషధారణలో ఎంతో అందంగా మెరిసిపోతూ కనిపించారు. తన వైవాహిక జీవితంపై ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఆమె చిరునవ్వులు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.
మెహ్రీన్ వివాహం చేసుకున్న వ్యక్తి పేరు అర్ష్ ఔలక్. ఆయనకు సినిమా ఇండస్ట్రీతో ఎటువంటి సంబంధం లేదని తెలుస్తోంది. వ్యాపార రంగానికి చెందిన వ్యక్తిగా అర్ష్ ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో సినీ పరిశ్రమకు దూరంగా ఉన్న వ్యక్తిని తన జీవిత భాగస్వామిగా ఎంచుకోవడం ఆసక్తికరంగా మారింది. ఈ జంట ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, అభిమానులు, సినీ ప్రముఖులు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
ఇదిలా ఉంటే, మెహ్రీన్ గతంలో 2021లో భవ్య బిష్ణోయ్‌తో నిశ్చితార్థం చేసుకున్న విషయం తెలిసిందే. హర్యానా మాజీ ముఖ్యమంత్రి భజన్ లాల్ మనవడు అయిన భవ్యతో జరిగిన ఆ నిశ్చితార్థం ఎంతో ఘనంగా జరిగింది. అయితే కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల ఆ నిశ్చితార్థం రద్దయింది. అనంతరం భవ్య బిష్ణోయ్ మరో వివాహం చేసుకోగా, మెహ్రీన్ కూడా ఇప్పుడు అర్ష్‌తో తన కొత్త జీవితాన్ని ప్రారంభించారు.
పంజాబ్‌కు చెందిన మెహ్రీన్ సినీ ప్రయాణం కృష్ణగాడి వీరప్రేమగాధ సినిమాతో ప్రారంభమైంది. ఆ తర్వాత మహానుభావుడు, రాజా ది గ్రేట్, ఎఫ్2, ఎఫ్3 వంటి విజయవంతమైన చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగుతో పాటు తమిళం, హిందీ, పంజాబీ భాషల్లో కూడా ఆమె నటించి తనకంటూ ప్రత్యేక ఫ్యాన్ బేస్‌ను సంపాదించుకున్నారు.
ప్రస్తుతం ఆమె చేతిలో కొత్త సినిమాలు లేకపోవడంతో, మెహ్రీన్ ఇక సినిమాలకు గుడ్‌బై చెప్పి కుటుంబ జీవితానికే ప్రాధాన్యం ఇవ్వాలనుకుంటున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై అధికారిక ప్రకటన ఇంకా రాలేదు. చివరిసారిగా ఆమె ఎఫ్3 సినిమాలో కనిపించారు. మొత్తానికి, నిశ్చితార్థం తర్వాత సైలెంట్‌గా ఉన్న మెహ్రీన్ ఒక్కసారిగా పెళ్లి వార్తతో అభిమానులకు షాక్ ఇచ్చారు. ఇప్పుడు ఆమె కొత్త జీవితాన్ని ఆనందంగా కొనసాగించాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram