Wedding: పెళ్లి చేసుకున్న ఇద్దరు మహిళలు (Video)

Wedding: చిత్రాల పెళ్లిళ్ల వేదికగా ఉత్తరప్రదేశ్ మారిపోయింది. భర్త స్వయంగా తన భార్యకు ఆమె ప్రియుడితో పెళ్లి చేయడం…కూతురితో నిశ్చితార్థమైన పెళ్లికొడుకుతో అత్తా లేచిపోవడం వంటి చిత్ర విచిత్రాల పెళ్లిళ్ల ఆ రాష్ట్రం నుంచి వైరల్ అయ్యాయి. అదే కోవలో తాజాగా ఇద్దరు మహిళలు పెళ్లి చేసుకున్న ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళితే యూపీలోని బదాయి కోర్టు ప్రాంగణంలోని శివాలయంలో ఇద్దరు మహిళలు తమ న్యాయవాదుల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. పరస్పరం దండలు మార్చుకుని ఉంగరాలు మార్చుకుున్నారు.
తమకు పురుషులు అంటే ఇష్టం లేదని.. మూడు నెలల నుండి కలిసి ఉన్నామని..తాము విడివిడిగా ఉండలేక పెళ్లి చేసుకున్నామని ఆ మహిళలు తెలిపారు. తొలుత ఆ మహిళలు తమ పెళ్లికి న్యాయ సహాయం కావాలని న్యాయవాదులను కోరారు. స్వలింగ సంపర్కుల వివాహానికి చట్టం ఒప్పుకోదని చెప్పడంతో మేం ఇద్దరు వేర్వేరుగా ఉండలేమంటూ కోర్టు ఆవరణలోనే న్యాయవాదుల సమక్షంలో వివాహాం చేసుకున్నారు