రూ.142కోట్ల నెక్లెస్ తో ఫ్యాషన్ షోలో మెగా కృష్ణారెడ్డి భార్య సుధా !

న్యూయార్క్ లో తాజాగా నిర్వహించిన 'మెటా గాలా' ఫ్యాషన్ వేడుకలో తెలంగాణ కాంట్రాక్టర్ మెగా కృష్ణారెడి భార్య సుధారెడ్డి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచారు. 7 ఏళ్ల సుధా రెడ్డి రూ. 142 కోట్ల విలువ చేసే నెక్లెస్‌ సహా మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన గౌను ధరించి ఫ్యాషన్ షో లో అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్నారు.

న్యూయార్క్ లో తాజాగా నిర్వహించిన ‘మెటా గాలా’ ఫ్యాషన్ వేడుకలో తెలంగాణ కాంట్రాక్టర్ మెగా కృష్ణారెడి భార్య సుధారెడ్డి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచారు. 7 ఏళ్ల సుధా రెడ్డి రూ. 142 కోట్ల విలువ చేసే నెక్లెస్‌ సహా మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన గౌను ధరించి ఫ్యాషన్ షో లో అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్నారు.

సుధా రెడ్డి ధరించిన నెక్లెస్ విలువ దాదాపు 15 మిలియన్ డాలర్లుగా అంటే అక్షరాల 142 వందల కోట్లుగా చెబుతున్నారు. పెద్ద పరిమాణంలో ఉన్న రోజ్- కట్ డైమండ్స్‌తో ఈ నెక్లెస్ రూపొందించినట్లు తెలిసింది. ఈ నెక్లెస్‌తో పాటు ఆమె 30 క్యారెట్ల డైమండ్ రింగ్, 40 క్యారెట్ల కొలంబియన్ ఎమరాల్డ్ రింగ్ కూడా ధరించారు.

మెటా గాలా ఈవెంట్ లో సుధారెడ్డి మెరుపులు

గతంలో 2021, 2024 ల్లోనూ మెట్ గాలా ఈవెంట్‌లో పాల్గొన్నారు. ఇప్పుడు మరోసారి 2026లోనూ మెటా గాలాకు హాజరుకావడం విశేషం. అంతకుముందు 2024 మెట్ గాలా ఈవెంట్‌లోనూ సుధా రెడ్డి 200 క్యారెట్ డైమండ్ జువెల్లరీ ధరించి.. ఐవరీ సిల్క్ గౌనులో మెరిశారు. 180 క్యారెట్ల డైమండ్ నెక్లెస్ సహా మరో 25 క్యారెట్ల డైమండ్ లాకెట్, మరో మూడు.. 20 క్యారెట్ల హార్ట్ షేప్ డైమండ్స్ , అలాగే డైమండ్స్ పొదిగిన ఉంగరం కూడా ధరించింది. వాటి విలువ దాదాపు రూ. 65 కోట్లుగా ఉంటుందని అప్పట్లో అంచనా వేశారు.

ప్రజల సంస్కృతి చిహ్నంగా ఫ్యాషన్ షో డ్రెస్

‘మెటా గాలా’ 2026 ఫ్యాషన్ షోలో సుధా రెడ్డి ధరించిన డ్రెస్ 3 వేల ఏళ్ల పురాతన మచిలీపట్నం కలంకారీ కళ శైలిలో రూపొందించారు. ఈ డ్రెస్ ర తయారీలో దాదాపు 90 మంది కళాకారులు, 3459 గంటలు పనిచేసినట్లు తెలిసింది. నెట్‌కేప్‌పై హైదరాబాద్ వృక్ష, జంతుజాలాల ఆకృతుల్ని రేషన్ జరీతో నేశారు. వెనకవైపు మెటల్ వృక్షాకృతి.. తెలంగాణ నేపథ్యాన్ని తలిపించేలా.. తంగేడు పువ్వు, జమ్మి చెట్టు, సూర్యుడు, చంద్రుడు, కల్పవృక్ష చిత్రాలను వేశారు. ఫ్యాషన్ డిజైనర్ మనీశ్ మల్హోత్రా డిజైన్ చేసిన సుధారెడ్డి డ్రెస్ ట్రీ ఆఫ్ లైఫ్ థీమ్‌తో రూపొందింది. ఇందులో జమ్మి చెట్టు, పాలపిట్ట, తంగేడు, కల్పవృక్షం వంటి మనకు తెలిసిన మోటిఫ్‌లను డ్రెస్‌పై ఎంతో అందంగా పొందుపరిచారు. ఈ ప్రత్యేకమైన డ్రెస్‌తో హైదరాబాద్ సంస్కృతిని, తెలుగు ప్రజల జీవన విధానాన్ని ప్రపంచ వేదికపై ప్రదర్శించాలనుకున్నట్లు సుధా రెడ్డి ఇన్‌స్టా పోస్ట్ ద్వారా వెల్లడించారు.

ఫ్యాషన్ ..సోషల్ సర్వీస్

సుధా రెడ్డి హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ పారిశ్రామిక వేత్త, బిలియనీర్, ఎంఈఐఎల్ (మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్) డైరెక్టర్. మేఘా గ్రూప్ అధినేత పి.వి. కృష్ణారెడ్డి సతీమణి. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో మెఘా గ్రూప్ దే కీలక పాత్ర. ఇకపోతే సుధారెడ్డి ఫ్యాషన్, అంతర్జాతీయ వేదికలపై భారతీయ సంస్కృతిని ప్రదర్శనలతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలతోనూ తరుచూ వార్తల్లో నిలుస్తున్నారు. సుధారెడ్డి ఫౌండేషన్ ద్వారా మహిళా సాధికారత, విద్య, క్యాన్సర్ సంరక్షణ, ఆరోగ్య రంగాల్లో సేవలు అందిస్తున్నారు. యునిసెఫ్ ఇండియా ఇంటర్నేషనల్ కౌన్సిల్ సభ్యురాలిగా కూడా ఉన్నారు.

భారత్ నుంచి పాల్గొన్న మరికొందరు..

మెటా గాలా ఈవెంట్‌‌కు.. భారత్ నుంచి రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ కూతురు, రిలయన్స్ రిటైల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఇషా అంబానీ సహా ప్రముఖ వ్యాపారవేత్త కుమార మంగళం బిర్లా కూతురు గాయని, వ్యాపారవేత్త అయిన అనన్య బిర్లా కూడా హాజరయ్యారు. ఇతర వ్యాపారవేత్తలు సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నటాషా పూనావాలా, బాలీవుడ్ దర్శకనిర్మాణ కరణ్ జోహార్, ఫ్యాషన్ డిజైనర్ మనీశ్ మల్హోత్రా పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి :

మహిళా పోలీస్ అధికారిణికి తప్పని వేధింపులు..ఏం జరుగుతుందీ..?
Humanoid Robot | సాధారణ మనిషిలాగే విమానం ఎక్కి వెళ్లిన రోబో.. అమెరికాలో విచిత్ర ఘటన!

Latest News