MANUU | హైదరాబాద్ నగరంలోని మౌలానా అజాద్ నేషన్ ఉర్దూ యూనివర్సిటీ( MANUU ) లో 2026-27 విద్యా సంవత్సరానికి కొత్త కోర్సులను ప్రవేశపెడుతున్నట్లు యూనివర్సిటీ యాజమాన్యం ప్రకటించింది. ఎమ్మెస్సీ ఇండస్ట్రీయల్ కెమిస్ట్రీ, ఎమ్మెస్సీ బయో ఇన్ఫర్మేటిక్స్, ఎంఏ ఫిల్మ్ మేకింగ్ కోర్సులను ప్రారంభిస్తున్నట్లు వెల్లడించింది. ఫిల్మ్ మేకింగ్ కోర్సును సెల్ఫ్ ఫైనాన్స్ కింద ఆఫర్ చేస్తున్నారు.
ఈ కోర్సులతో పాటు పార్ట్ టైమ్ కింద అల్టర్‌నెటివ్ డిస్ప్యూట్ రిజల్యూషన్, సైబర్ లా అండ్ డిజిటల్ గవర్నెన్స్ వంటి కోర్సులను పీజీ డిప్లొమా కింద అందిస్తున్నారు. ఈ కోర్సులు హైదరాబాద్, దర్భంగా క్యాంపస్‌లలో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. హైదరాబాద్ క్యాంపస్‌లో కొత్తగా జ్యువెలరీ డిజైన్ కోర్సును కూడా ప్రారంభించామని పేర్కొన్నారు. ఎమ్మెస్సీ, ఎంఏ, పీజీ డిప్లొమా కోర్సులకు అర్హులైన అభ్యర్థులు జూన్ 10వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. తదితర వివరాల కోసం 040- 23006612 నంబర్‌ను సంప్రదించొచ్చు.
దరఖాస్తు కోసం ఈ వెబ్‌సైట్‌ను క్లిక్ చేయండి.. https://manuu.edu.in/home
