LSG vs DC IPL:సిక్స‌ర్స్‌తో విల‌య‌తాండం..అత‌డొక్క‌డి వ‌ల్ల‌నే గెలిచిన ఢిల్లీ క్యాపిట‌ల్స్

  • Publish Date - April 13, 2024 / 06:36 AM IST

LSG vs DC IPL:వ‌రుస ప‌రాజ‌యాల‌తో స‌త‌మ‌తం అవుతున్న ఢిల్లీ క్యాపిట‌ల్స్ జ‌ట్టు ఖాతాలో మ‌రో విజ‌యం వ‌చ్చి చేరింది. లక్నోతో జరిగిన మ్యాచ్లో 6 వికెట్ల తేడాతో ఢిల్లీ ఘ‌న విజ‌యం సాధించి పాయింట్ల ప‌ట్టిక‌లో 9వ స్థానానికి వ‌చ్చింది. ప్ర‌స్తుతం బెంగ‌ళూరు చివ‌రి స్థానంలో ఉంది. హ్యాట్రిక్ ఓటములతో ఆ టీం చాలా డిప్రెష‌న్‌లో ఉండ‌గా, ఈ విజ‌యం ఢిల్లీకి మంచి బూస్ట‌ప్ ఇస్తుంద‌ని చెప్పాలి. మొదట బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లకు 167 పరుగులు చేసింది. ఆయుష్ బదోని (55*; 35 బంతుల్లో, 5×4, 4×6) అర్ధ సెంచరీతో చెల‌రేగ‌గా, కేఎల్ రాహుల్ (39; 22 బంతుల్లో, 5×4, 1×6) ఫర్వాలేదనిపించాడు. ల‌క్నో జ‌ట్టులో ఇద్ద‌రు మాత్ర‌మే విలువైన ప‌రుగులు చేశారు. మిగ‌తావారంతా త‌క్కువ స్కోరుకే వెనుదిరిగారు. కుల్‌దీప్ యాదవ్ (3/20) మూడు వికెట్లతో ఆకట్టుకోగా, ఖలీల్ అహ్మద్ 2 వికెట్లు తీశాడు.

లక్నో మూడో ఓవర్‌లోనే డికాక్ (19; 13 బంతుల్లో, 4×4) వికెట్ కోల్పోగా, ఆ త‌ర్వాత దేవదత్ పడిక్కల్‌ (3; 6 బంతుల్లో) కూడా వెంట‌నే ఔట‌య్యాడు. ఇక కుల్దీప్ యాద‌వ్ రంగంలోకి దిగి తొలి తొమ్మిది బంతుల్లోనే స్టొయినిస్ (8; 10 బంతుల్లో, 1×4), నికోలస్ పూరన్ (డకౌట్), కేఎల్ రాహుల్ (39; 22 బంతుల్లో, 5×4, 1×6)ను పెవీలియ‌న్‌కి పంపించాడు. దీంతో ల‌క్నో క‌ష్టాల‌లో ప‌డింది. 14 ఓవర్లలో 94 పరుగులకే లక్నో సూపర్ జెయింట్స్ ఏడు వికెట్లు కోల్పోగా, ఆ స‌మ‌యంలో వ‌చ్చిన ఆయుష్ బ‌దోని .. అర్షద్ ఖాన్ (20*; 16 బంతుల్లో, 2×4) తో క‌లిసి విలువైన భాగ‌స్వామ్యాన్ని న‌మోదు చేశాడు. దీంతో ల‌క్నో 167 ప‌రుగులు చేయ‌గ‌లిగింది. ఇక 168 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన ఢిల్లీ నాలుగో ఓవర్‌లో ఓపెనర్ డేవిడ్ వార్నర్ (8; 9 బంతుల్లో, ) వికెట్ కోల్పోయింది.

యశ్ ఠాకూర్ బౌలింగ్‌లో ఫ్లిక్ షాట్‌కు ట్రై చేసి వార్న‌ర్ బౌల్డ్ అయ్యాడు. త‌ర్వాత వ‌చ్చిన జేక్ ఫ్రేజర్ మెక్‌గర్క్ (55; 35 బంతుల్లో, 2×4, 5×6) దూకుడుగా ఆడి మెరుపు అర్ధ‌శ‌త‌కం సాధించాడు. ఇక పృథ్వీ షా (32; 22 బంతుల్లో, 6×4) కూడా సహకరించడంతో ఢిల్లీ పవర్‌ప్లేలో 62 పరుగులు చేసింది. రిషభ్ పంత్ (41; 24 బంతుల్లో, 4×4, 2×6) కూడా విలువైన ప‌రుగులు చేసి ఢిల్లీ విజ‌యంలో కీల‌క పాత్ర పోషించాడు. అయితే వెంట‌వెంట‌నే ఫ్రేజర్, పంత్ ఔట్ కావ‌డంతో ఢిల్లీ అభిమానుల‌లో కాస్త టెన్ష‌న్ నెల‌కొంది. కాని ట్రిస్టన్ స్టబ్స్ (15*; 9 బంతుల్లో, 1×6), షై హోప్ (11*; 10 బంతుల్లో, 1×4) లక్ష్యాన్ని సునాయాసంగా చేధించారు.

Latest News