IRCTC Andaman Tour | రూ.50వేలలోనే అండమాన్ ట్రిప్.. స్పెషల్ ట్రావెల్ ప్యాకేజీ తీసుకొచ్చిన ఐఆర్‌సీటీసీ!

IRCTC Andaman Tour | ఈ వేసవికాలంలో అండమాన్ దీవులకు వెళ్లాలనుకునే వారి కోసం ఐఆర్‌సీటీసీ ప్రత్యేక టూర్ ప్యాకేజీని తీసుకొచ్చింది. రూ.50వేలలోనే పోర్ట్‌బ్లెయిర్, హావెలాక్, నీల్ ఐలాండ్, బరాటంగ్ వంటి ప్రదేశాలను కవర్ చేసేలా ఈ ట్రిప్‌ను రూపొందించింది.

IRCTC Andaman Tour | ఈ వేసవికాలంలో అండమాన్ దీవులకు వెళ్లాలనుకునే వారి కోసం ఐఆర్‌సీటీసీ ప్రత్యేక టూర్ ప్యాకేజీని తీసుకొచ్చింది. నీలి సముద్రం, తెల్లటి ఇసుక తీరాలు.. దట్టమైన అడవులు.. ఇలా అన్నింటినీ ఒకే ట్రిప్‌లో చూసేవిధంగా Alluring Andaman పేరుతో ఈ స్పెషల్ ట్రావెల్ ప్యాకేజీని అందిస్తోంది. పోర్ట్‌బ్లెయిర్, హావెలాక్, నీల్ ఐలాండ్, బరాటంగ్ వంటి ప్రదేశాలను కవర్ చేసేలా ఈ ట్రిప్‌ను రూపొందించారు.

ప్యాకేజీ ధరలు

ఏప్రిల్ 18వ తేదీన త్రివేండ్రం నుంచి ఈ అండమాన్ ట్రిప్ ప్రారంభం కానుంది. మొత్తం 6 రాత్రులు, 7 రోజుల పాటు ఈ ట్రిప్ కొనసాగుతుంది.  ఈ టూర్ కోసం ఐఆర్‌సీటీసీ పెద్దల నుంచి ఒక్కొక్కరికీ రూ.64,900(సింగిల్ ఆక్యుపెన్సీ) వసూలు చేస్తుంది. అదే డబుల్ ఆక్యుపెన్సీ అయితే ఒక్కొక్కరికీ రూ. 49,050, ట్రిపుల్ ఆక్యుపెన్సీ అయితే రూ.48,550 చార్జీ చేస్తుంది. ఇక ఐదు నుంచి 11 సంవత్సరాల పిల్లలకు ప్రత్యేక ధరలు వర్తిస్తాయి. ఇక ఈ టూర్‌కు పరిమితంగా 14 సీట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయని ఐఆర్‌సీటీసీ అధికారులు తెలిపారు.

రోజువారీ షెడ్యూల్ ఇదీ..

మొదటి రోజు: త్రివేండ్రం ఎయిర్‌పోర్టు నుంచి బయల్దేరి శ్రీ విజయపుర (పోర్ట్‌బ్లెయిర్) ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అక్కడ హోటల్‌లో చెక్ ఇన్ అయిన తర్వాత కార్బిన్ కోవ్ బీచ్‌కు వెళ్తారు. అక్కడ ఎంజాయ్ చేసిన తర్వాత సాయంత్ంర సెల్యులర్ జైలును సందర్శిస్తారు. అక్కడ జరిగే లైట్ అండ్ సౌండ్ షోను వీక్షిస్తారు. అనంతరం హోటల్‌కు వెళ్లి డిన్నర్ చేస్తారు. రాత్రికి అక్కడే బస ఉంటుంది.

రెండో రోజు: తెల్లవారుజామునే బ్రేక్‌ఫాస్ట్ ముగించుకుని బారాటంగ్ బయల్దేరతారు. జరావా ట్రైబ్ ప్రాంతం గుండా ఈ ప్రయాణం సాగుతుంది. మాంగ్రూవ్ ఫారెస్ట్ నుంచి వెళ్లే బోట్ రైడ్ ఆకట్టుకుంటుంది. లైమ్ స్టోన్ కేవ్స్‌ను చూసుకుని సాయంత్రానికి మళ్లీ పోర్ట్‌ప్లెయిర్‌కు చేరుకుంటారు. రాత్రికి అక్కడే బస ఉంటుంది.

మూడో రోజు: బ్రేక్‌ఫాస్ట్ అనంతరం క్రూయిజ్ ద్వారా హేవ్‌లాక్ వెళ్తారు. ముందుగా కాలాపథర్ బీచ్‌ను సందర్శిస్తారు. అనంతరం హోటల్‌లో చెక్ ఇన్ అయ్యి ఫ్రెషప్ అవుతారు. మధ్యాహ్నం తర్వాత రాధానగర్ బీచ్‌ను సందర్శిస్తారు. హేవ్‌లాక్‌లోనే హోటల్‌లోనే డిన్నర్ చేసి, రాత్రి బస చేస్తారు.

నాలుగో రోజు: హేవ్‌లాక్‌ దీవిలోని హోటల్‌లో బ్రేక్‌ఫాస్ట్ అనంతరం ఎలిఫెంట్ బీచ్‌కు తీసుకెళ్తారు. మధ్యాహ్నం నీల్ ఐలాండ్‌కు వెళ్తారు హోటల్‌లో చెక్ ఇన్ అయిన తర్వాత సాయంత్రం లక్ష్మణ్‌పూర్ బీచ్‌లో ఎంజాయ్ చేస్తారు. అక్కడే అందమైన సూర్యాస్తమయాన్ని ఆస్వాదిస్తారు. రాత్రికి నీల్ దీవిలోనే బస ఉంటుంది.

ఐదో రోజు: బ్రేక్‌ఫాస్ట్ అనంతరం నాచురల్ బ్రిడ్జ్, భరత్‌పూర్ బీ‌చ్‌లను సందర్శిస్తారు. అక్కడ నుంచి పోర్ట్‌ప్లెయిర్ బయల్దేరతారు.

ఆరో రోజు: బ్రేక్‌ఫాస్ట్ అనంతరం రోస్ ఐలాండ్‌‌ను సందర్శిస్తారు. తిరిగి వచ్చేప్పుడు సెల్యూలర్ జైలును సందర్శిస్తారు. సాయంత్రం ఫ్రీ టైమ్ ఉంటుంది. ఆ సమయంలో షాపింగ్ చేసుకోవచ్చు. రాత్రికి పోర్ట్‌బ్లెయిర్‌లోనే బస ఉంటుంది.

ఏడో రోజు: పోర్ట్‌బ్లెయిర్ నుంచి బయల్దేరి త్రివేండ్రం చేరుకోవడంతో ట్రిప్ ముగుస్తుంది.

ప్యాకేజీలో ఉండే సదుపాయాలు

* త్రివేండ్రం నుంచి పోర్ట్‌బ్లెయిర్‌కు రౌండ్ ట్రిప్ విమాన టికెట్లు
*AC హోటల్ వసతి
* క్రూయిజ్/ఫెర్రీ టికెట్లు
* బ్రేక్‌ఫాస్ట్+డిన్నర్
* లోకల్ ట్రాన్స్‌పోర్టు (AC)
* టూర్ కోఆర్డనేటర్

ప్యాకేజీలో లేని సదుపాయాలు

* ఎంట్రీ టికెట్లు
* వాటర్ స్పోర్ట్స్
* వ్యక్తిగత ఖర్చులు
* అదనపు భోజనం

ఐఆర్‌సీటీసీ కీలక సూచనలు

ప్రయాణానికి కనీసం రెండు గంటల ముందే విమానాశ్రయానికి చేరుకోవాలని ఐఆర్‌సీటీసీ అధికారులు సూచించారు. టూర్ షెడ్యూల్ మారే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఫ్లైట్ ఆలస్యమైతే దానికి తమది బాధ్యత కాదని తెలిపారు. ట్రిపుల్ షేరింగ్‌‌లో Extra Mattress ఇస్తారని పేర్కొన్నారు.

Read More:

IRCTC Vietnam Tour | తక్కువ ఖర్చులో విదేశీ టూర్.. వియత్నాం వైబ్స్ పేరుతో ఐఆర్‌సీటీసీ స్పెషల్ ప్యాకేజీ!

IRCTC Kerala Tour | హైదరాబాద్ నుంచి కేరళ ట్రిప్.. మున్నార్, అలెప్పీ టూర్ రూ.15వేలకే.. ఐఆర్‌సీటీసీ స్పెషల్ ప్యాకేజీ..!

Latest News