IRCTC Vietnam Tour | తక్కువ ఖర్చులో విదేశీ టూర్.. వియత్నాం వైబ్స్ పేరుతో ఐఆర్‌సీటీసీ స్పెషల్ ప్యాకేజీ!

IRCTC Vietnam Tour | విదేశాలకు వెళ్లాలనే కలను తక్కువ ఖర్చుతో నిజం చేసుకోవాలని అనుకుంటున్నారా! మీకోసమే ఐఆర్‌సీటీసీ వియత్నాం వైబ్స్ (Vietnam Vibes) పేరుతో అద్భుతమైన టూర్ ప్యాకేజీని తీసుకొచ్చింది.

IRCTC Vietnam Tour | తక్కువ ఖర్చులో విదేశీ టూర్.. వియత్నాం వైబ్స్ పేరుతో ఐఆర్‌సీటీసీ స్పెషల్ ప్యాకేజీ!

IRCTC Vietnam Tour | విదేశాలకు వెళ్లాలనే కలను తక్కువ ఖర్చుతో నిజం చేసుకోవాలని అనుకుంటున్నారా! మీకోసమే ఐఆర్‌సీటీసీ వియత్నాం వైబ్స్ (Vietnam Vibes) పేరుతో అద్భుతమైన టూర్ ప్యాకేజీని తీసుకొచ్చింది. ఇందులో భాగంగా ప్రకృతి అందాలు, సముద్ర తీరాలు, చారిత్రక ప్రదేశాలు, బీచ్‌ల్లో తిరుగుతూ టూర్ ఆద్యాంతం ఆస్వాదించవచ్చు.

చెన్నై, బెంగళూరు నగరాల నుంచి ఏప్రిల్ 3వ తేదీన ప్రారంభమయ్యే ఈ టూర్ మొత్తం 8 రాత్రులు, 9 రోజుల పాటు కొనసాగనుంది. ఈ పర్యటనలో భాగంగా హనోయి సిటీ, హోలోంగ్ బే క్రూయిజ్, డా నాంగ్ గోల్డెన్ బ్రిడ్జ్, బానా హిల్స్ కేబుల్ కార్, కూ చీ టన్నెల్స్, మెకాంగ్ డెల్టా బోట్ రైడ్ వంటివి ఆస్వాదించవచ్చు

ప్యాకేజీ వివరాలు

బెంగళూరు, చెన్నై నగరాల నుంచి ఐఆర్‌సీటీసీ వియత్నాం టూర్ నిర్వహిస్తుంది.

ఈ క్రమంలో బెంగళూరు నుంచి వెళ్లే ప్రయాణికులకు సింగిల్ ఆక్యుపెన్సీ ధరను రూ.1,28,400గా ఐఆర్‌సీటీసీ నిర్ణయించింది. అదే డబుల్ షేరింగ్ అయితే ఒక్కొక్కరికీ రూ.1,14,900; ట్రిపుల్ షేరింగ్ అయితే రూ.1,13,800 చార్జి చేస్తుంది. ఇక పిల్లలకు అయితే బెడ్‌తో కలిపి రూ.1,04,100; బెడ్ లేకుండా అయితే రూ.93,500 వసూలు చేస్తున్నారు.

చెన్నై నుంచి వెళ్లే ప్రయాణికులకు సింగిల్ ఆక్యుపెన్సీ ధరను రూ.1,23,050గా ఐఆర్‌సీటీసీ నిర్ణయించింది. అదే డబుల్ షేరింగ్ అయితే ఒక్కొక్కరికీ రూ.1,09,350; ట్రిపుల్ షేరింగ్ అయితే రూ.1,08,300 చార్జి చేస్తుంది. ఇక పిల్లలకు అయితే బెడ్‌తో కలిపి రూ.98,450; బెడ్ లేకుండా అయితే రూ.87,600 వసూలు చేస్తున్నారు.

రోజువారీ టూర్ ప్లాన్

మొదటి రోజు: బెంగళూరు, చెన్నై విమానాశ్రయాల నుంచి కోల్‌కతా మీదుగా వియత్నాం బయల్దేరతారు. రాత్రి ప్రయాణం ఉంటుంది.

రెండో రోజు: ఉదయం హనోయిలోని ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. ఇమ్మిగ్రేషన్ ప్రాసెస్ పూర్తి చేసుకుని హోటల్‌కి వెళ్లి చెక్ ఇన్ అవుతారు. ఫ్రెషప్ అయి బ్రేక్‌ఫాస్ట్ చేసిన తర్వాత సిటీ టూర్ ప్రారంభమవుతుంది. హో చి మిన్ కాంప్లెక్స్, బా డిన్ స్క్వైర్, వన్ పిలర్ పగోడా, టెంపుల్ ఆఫ్ లిటరేచర్‌ను సందర్శిస్తారు. తర్వాత ఓల్డ్ క్వార్టర్ వీధుల్లో నడుస్తూ స్థానిక మార్కెట్లను చూస్తారు. రాత్రికి హనోయిలోనే బస ఉంటుంది.

మూడో రోజు: బ్రేక్‌ఫాస్ట్ అనంతరం హోలోంగ్ బేకు బయల్దేరి వెళ్తారు. సుమారు 3 గంటల సమయం పడుతుంది. లంచ్ తర్వాత క్రూయిజ్‌లో ఎక్కుతారు. సముద్రం మధ్యలో ఉన్న లైమ్‌స్టోన్ కొండలను చూస్తూ ప్రయాణం సాగిస్తూ ఎంజాయ్ చేస్తారు. బోట్ యాక్టివిటీస్‌తో రిలాక్స్ కూడా అవ్వొచ్చు. రాత్రికి క్రూయిజ్‌లోనే డిన్నర్, బస ఉంటుంది.

నాలుగో రోజు: సముద్రం మధ్యలో అందమైన సూర్యోదయాన్ని ఆస్వాదిస్తారు. అనంతరం బ్రేక్‌ఫాస్ట్ చేసుకుని.. హనోయికి తిరిగి వెల్తారు. అక్కడి నుంచి డా నాంగ్‌కు విమానంలో వెళ్తారు. రాత్రికి అక్కడే బస ఉంటుంది.

ఐదో రోజు: బ్రేక్‌ఫాస్ట్ అనంతరం సైట్ సీయింగ్‌కు బయల్దేరి వెళ్లారు. లేడీ బుద్ధ విగ్రహం, మార్బుల్ మౌంటైన్, జపనీస్ కవర్డ్ బ్రిడ్జి, సిల్క్ మ్యూజియం వంటి ప్రదేశాలను సందర్శిస్తారు. సాయంత్రం స్థానిక వీధుల్లో తిరుగుతూ షాపింగ్ చేయవచ్చు. రాత్రికి డా నాంగ్‌లో బస ఉంటుంది.

ఆరో రోజు: బ్రేక్‌ఫాస్ట్ అనంతరం బానా హిల్స్‌కు బయల్దేరి వెళ్తారు. ఈ క్రమంలో కేబుల్ కార్ రైడ్ చేస్తారు. గోల్డెన్ బ్రిడ్జి, ఫాంటసీ పార్క్ సందర్శిస్తారు. చువా మౌంటైన్ వ్యూస్‌ను ఆస్వాదించవచ్చు. ఫొటోలకు ఇది బెస్ట్ స్పాట్. ఇక రాత్రికి డా నాంగ్‌లోనే బస ఉంటుంది.

ఏడో రోజు: బ్రేక్‌ఫాస్ట్ అనంతరం డానాంగ్ నుంచి హో చి మిన్‌కు విమానంలో వెళ్తారు. తర్వాత కూ చీ టన్నెల్స్, రియూనిఫికేషన్ ప్యాలెస్, నోట్రడామ్ క్యాథడ్రల్, వార్ మ్యూజియం సందర్శిస్తారు. ఈ సందర్భంగా వియత్నాం యుద్ధ చరిత్రను తెలుసుకునే అవకాశం ఉంది. రాత్రికి హో చి మిన్‌లోనే బస ఉంటుంది.

ఎనిమిదో రోజు: బ్రేక్‌ఫాస్ట్ అనంతరం మెకాంగ్ డెల్టాకు బయల్దేరి వెళ్తారు. ఈ సందర్భంగా మై థో ప్రాంతంలో పర్యటిస్తారు. బోట్ రైడ్ చేస్తారు. స్థానికంగా ఉన్న కొబ్బరి తోటలు చూడటమే కాకుండా.. అక్కడి గ్రామీణ లైఫ్‌స్టైల్‌ను పరిశీలిస్తారు. వారితో సాంప్రదయా సంగీతం, ఫుడ్‌తో అద్భుతమైన అనుభూతిని ఆస్వాదించవచ్చు.

తొమ్మిదో రోజు: ఉదయం హో చి మిన్ నుంచి కోల్‌కతా మీదుగా చెన్నై, బెంగళూరుకు చేరుకోవడంతో టూర్ ముగుస్తుంది..

ప్యాకేజీలో ఉండే సదుపాయాలు

* విమాన టికెట్లు
* 3 స్టార్ హోటల్, క్రూయిజ్ స్టే
* ఏడు రోజుల పాటు బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్
* వీసా ఛార్జీలు
* లోకల్ ట్రాన్స్‌పోర్టు
* ఎంట్రీ టికెట్లు
* టూర్ గైడ్, ట్రావెల్ ఇన్సూరెన్స్

ప్యాకేజీలో లేని సదుపాయాలు

* టిప్స్
* వ్యక్తిగత ఖర్చులు
* ప్రత్యక యాక్టివిటీస్
* ఫ్లైట్ సర్ ఛార్జీలు పెరిగితే అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.

ముఖ్య నిబంధనలు

కనీసం ఆరు నెలల వ్యాలిడిటీ ఉన్న పాస్‌పోర్టు ఉండాలి. పూర్తి పేమెంట్ ముందుగానే చేయాలి. వీసా రిజెక్ట్ అయితే మనీ రీఫండ్ ఉండదు.

Read More:

IRCTC Thailand Tour | హైదరాబాద్ నుంచి థాయ్‌లాండ్ టూర్.. ఐఆర్‌సీటీసీ స్పెషల్ ప్యాకేజీ.. రూ.53,900 నుంచే!

IRCTC Andaman Package | హైదరాబాద్ నుంచి అండమాన్ టూర్.. ఐఆర్‌సీటీసీ ప్యాకేజీ వివరాలివే!