రప్పా రప్పా ఫైట్..కోబ్రాను ముక్కలు చేసిన ముంగిస: వైరల్​ వీడియో:

వైరల్​ వీడియో: బలమైన పెద్ద జంతువులు సైతం చిన్న ప్రాణుల పోరాట నైపుణ్యానికి ఓటమి చవి చూస్తుంటాయి. భారీ కోబ్రా ఒకటి ముంగిస నోటికి చిక్కి బలైపోయిన వీడియో ముంగిస పోరాట నైపుణ్యానికి నిదర్శనంగా నిలిచింది..

విధాత : మనుగడ కోసం వన్యప్రాణుల పోరాటం ఒక్కోసారి భీకరంగా సాగుతుంది. బలమైన పెద్ద జంతువులు సైతం చిన్న ప్రాణుల పోరాట నైపుణ్యానికి ఓటమి చవి చూస్తుంటాయి. భారీ తాచుపాము ఒకటి ముంగిస నోటికి చిక్కి కరకర ఫలహారమైన వీడియో ముంగిస పోరాట నైపుణ్యానికి నిదర్శనంగా నిలిచింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

అడవిలో మట్టిదారిలో ఎదురుపడిన ముంగిస, నాగులు పరస్పరం తలపడ్డాయి. అత్యంత విషపూరితమైన కోబ్రా కోపంగా బుసలు కొడుతూ పడగ విప్ప ముంగిసను తన విషపు కాటుతో అంతం చేయాలని ప్రయత్నించింది. అయితే కోబ్రా ప్రాణాంతకమైన కాటును తప్పించుకుంటూ.. ముంగిస సాగించిన పోరాటం ఆసక్తికరంగా సాగింది. ముంగిస నాగుపామును అలసిపోయేలా చేసి..దాని వేగం, చురుకు దనం తగ్గిపోయే వరకు దానికి కాటు బారిన పడకుండా పోరాడింది.

పాము అలసిపోయిందని గ్రహించిన వెంటనే ఒక్క ఉదుటున పాము తలను నోటి కరిచి కొరొకి ముక్కలు చేసింది.. ఈ వీడియో చూసిన నెటిజన్లు పాము ముంగిస పోరాటంలో విజేతను బలం…విషం కాకుండా వ్యూహాత్మక పోరాట ఎత్తుగడలే నిర్ణయించాయని కామెంట్లు పెడుతున్నారు.

 

Latest News