7 Arts Sarayu | అద్భుతమైన నటనతో, డైలాగులతో, హావభావాలతో సినీ రంగ ప్రవేశం చేసే రోజులు మారాయ్.. కాస్త బోల్డ్ నెస్ పెంచేసి, బూతు డైలాగ్స్ నాలుగు చెబితే చాలు ఓవర్ నైట్‌లో.. సినిమాల వరకూ ఎందుకు వెబ్ సిరీస్‌లలోనే ఫేమస్ అయిపోవచ్చు. అలా వచ్చినవారు ఈ మధ్యకాలంలో చాలామందే ఉన్నారు. అయితే ఈమె రూటు మాత్రం కాస్త సెపరేటు. యూట్యూబర్‌గా కెరియర్ మొదలుపెట్టి, ఫేమస్ అయ్యి బిగ్ బాస్ షో వరకూ ప్రయాణించింది ఈ […]
7 Arts Sarayu |
అద్భుతమైన నటనతో, డైలాగులతో, హావభావాలతో సినీ రంగ ప్రవేశం చేసే రోజులు మారాయ్.. కాస్త బోల్డ్ నెస్ పెంచేసి, బూతు డైలాగ్స్ నాలుగు చెబితే చాలు ఓవర్ నైట్‌లో.. సినిమాల వరకూ ఎందుకు వెబ్ సిరీస్‌లలోనే ఫేమస్ అయిపోవచ్చు. అలా వచ్చినవారు ఈ మధ్యకాలంలో చాలామందే ఉన్నారు.
అయితే ఈమె రూటు మాత్రం కాస్త సెపరేటు. యూట్యూబర్‌గా కెరియర్ మొదలుపెట్టి, ఫేమస్ అయ్యి బిగ్ బాస్ షో వరకూ ప్రయాణించింది ఈ బోల్డ్ భామ. నోరు విప్పితే డబుల్ మీనింగ్ డైలాగులు, మాటలతో కుర్రకారుకు కాకపుట్టించడమే పని పెట్టుకుందో ఏమో ‘సరయు’ అనగానే టక్కున ఆమె బోల్డ్ కంటెంట్ గుర్తుకొస్తుంది.
అమ్మడి రేంజ్ అలాంటిది మరి. బూతుల తో సినిమా రివ్యూలు చెప్పడం అనే కొత్త ట్రెండ్ స్టార్ట్ చేసింది ఈ అమ్మడే.. అలాగే డోస్ బాగా పెంచేసి అడల్ట్ కంటెంట్‌తో వీడియోలు చేసి బోలెడు వైరల్ అయింది. ఇక ఇలా పాపులర్ అయిన వాళ్ళంతా తేలే చోటు అదే బిగ్ బాస్ షో సీజన్ 5కి చేరింది.
ఆ హౌస్‌లో సరయు కరెక్ట్‌గా ఫిట్ అయ్యే పర్సన్ అవుతుందని, ఆమె బోల్డ్ మాటలు, బూతు పంచాయితీలు అక్కడ సరిగ్గా సరిపోతాయని ఈ దెబ్బతో బోలెడు కంటెంట్ పట్టేయ వచ్చనుకున్నారు బిగ్ బాస్ యాజ మాన్యం. కానీ సరయు కొద్దిరోజులకే హౌస్ నుంచి ఎలిమినేట్ అయింది. అక్కడి నుంచి వచ్చిన కొద్ది రోజులకే బిగ్ బాస్ షో మీద సరయు నిప్పులు చెరిగింది.
బిగ్ బాస్ షో అంతా ఫేక్ అని.. డబ్బులు ఎదిరిచ్చి మరీ ఈ షోకి తీసుకెళతారని చెప్పిన సరయు, వారికి ఏమాత్రం వ్యతిరేకంగా మాట్లాడినా.. చెడ్డగా చూపించి వెంటనే బయటకు పంపేస్తారనేలా కామెంట్స్ చేసింది. ఇప్పుడామె మాటలు సోషల్ మీడియాలో సైతం వైరల్ అవుతున్నాయి.
ఇక వ్యక్తిగతంగా సరయు ప్రేమకు, పెళ్ళికి దూరమట. అసలు అలాంటి ఆలోచనే తనకు లేదని తెలిపింది. అయితే మెగా హీరో, గ్లోబల్‌స్టార్ రామ్ చరణ్ అంటే మాత్రం యమా క్రేజ్ అని, అతనితో ఒక్క రోజు డేటింగ్ చేసినా చాలని.. ఆరోజు గానీ వస్తే చచ్చినా వదులుకోనని చెప్పుకొచ్చింది. అయితే ఈ బోల్డ్ భామకు అవకాశాలు బాగానే వస్తున్నాయి. 18 పేజెస్ సినిమాలో నిఖిల్ సరసన అతని ఫ్రెండ్‌గా ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ చేసింది. ఇకపై మరిన్ని చిత్రాల్లో కనిపించనుందట సరయు.