Tirupathi | విద్యార్థినిని బలవంతంగా పెళ్లి చేసుకున్న లెక్చరర్.. ఆ తర్వాత ఏమైందంటే..?
Tirupathi | విధాత: విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఓ లెక్చరరే వక్ర బుద్ధిని ప్రదర్శించాడు. ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న అమ్మాయికి మాయమాటలు చెప్పి ప్రేమ ముగ్గులోకి దింపాడు. ఆ తర్వాత ఆమెను బలవంతంగా పెళ్లి చేసుకున్నాడు. అయితే లెక్చరర్ నిజస్వరూపం తెలియడంతో సదరు యువతి షాకైంది. లెక్చరర్‌కు ఇదివరకే పెళ్లైందని, ఓ ఆడబిడ్డ కూడా ఉందని ఇంటర్ విద్యార్థినికి తెలియడంతో తల్లిదండ్రుల సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివరాల్లోకి వెళ్తే.. చిత్తూరు జిల్లా (Chitoor Dist) గంగవరం […]

Tirupathi |
విధాత: విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఓ లెక్చరరే వక్ర బుద్ధిని ప్రదర్శించాడు. ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న అమ్మాయికి మాయమాటలు చెప్పి ప్రేమ ముగ్గులోకి దింపాడు. ఆ తర్వాత ఆమెను బలవంతంగా పెళ్లి చేసుకున్నాడు. అయితే లెక్చరర్ నిజస్వరూపం తెలియడంతో సదరు యువతి షాకైంది. లెక్చరర్‌కు ఇదివరకే పెళ్లైందని, ఓ ఆడబిడ్డ కూడా ఉందని ఇంటర్ విద్యార్థినికి తెలియడంతో తల్లిదండ్రుల సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది.
వివరాల్లోకి వెళ్తే.. చిత్తూరు జిల్లా (Chitoor Dist) గంగవరం మండలానికి చెందిన చలపతి(33) అనే వ్యక్తి పలమనేరు (Palamaneru)లోని ఓ ప్రయివేటు ఇంటర్ కాలేజీలో లెక్చరర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. చలపతి గతేడాది ఓ యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఓ ఆడబిడ్డకు తండ్రి కూడా అయ్యాడు. తనకు పెళ్లై, సంతానం కలిగినప్పటికీ.. చలపతి విద్యార్థినులపై కన్నేశాడు. అమ్మాయిలకు వివిధ రకాల గిఫ్ట్‌లు ఇచ్చి వారిని లొంగదీసుకునే ప్రయత్నం చేసేవాడు.
అయితే ఓ విద్యార్థినికి తియ్యని మాటలు చెప్పి.. ప్రేమ ముగ్గులోకి దింపాడు. ఇక బుధవారం చివరి పరీక్ష రాసి బయటకు వచ్చిన ఆ విద్యార్థినిని బలవంతంగా తిరుపతిలోని ఓ ఆలయంలోకి తీసుకెళ్లాడు. అక్కడ ఆమెకు తాళి కట్టేశాడు. ఆ తర్వాత చలపతి నిజస్వరూపం బయటపడింది.
చలపతికి పెళ్లైందని, ఓ పాప కూడా జన్మించిందని తెలిసింది. దీంతో షాక్‌కు గురైన విద్యార్థిని జరిగిన విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పింది. ఇక గురువారం రాత్రి చలపతి కళ్లుగప్పి గంగవరం పోలీసు స్టేషన్‌కు చేరుకుంది. యువతి తన తల్లిదండ్రులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో చలపతిపై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి, రిమాండ్‌కు తరలించారు.