Begusarai |
విధాత: సరిగమపదనిసలను వదిలేసి సరసాలకు తెరలేపాడు. సంగీతం నేర్పిస్తానని చెప్పి.. దాని మాటున ఓ యువతితో రాసలీలలు కొనసాగిస్తున్నాడు. యువతితో పాటు మ్యూజిక్ టీచర్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని పోలీసులకు అప్పగించారు స్థానికులు. ఈ ఘటన బీహార్‌లోని బెగుసరాయి జిల్లాలో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. బెగుసరాయి జిల్లాలోని పత్కౌలా గ్రామానికి చెందిన కిషన్ దేవ్ చౌరాసియా(45) గత కొంతకాలం నుంచి స్థానిక విద్యార్థులకు మ్యూజిక్ క్లాసులు చెబుతున్నాడు. ఇతను హార్మోనియం వాయించడంలో దిట్ట.
అయితే చౌరాసియా వద్దకు సంగీతం నేర్చుకునేందుకు ఓ 20 ఏండ్ల యువతి వచ్చింది. ఆమెకు సంగీత పాఠాలు నేర్పిస్తూనే సరసాలకు తెరలేపాడు. ఆ యువతితో శృంగారం కార్యంలో నిమగ్నమయ్యాడు చౌరాసియా.
ఈ ఘటనను స్థానికులు గుర్తించి, వారిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం చౌరాసియాకు దేహశుద్ధి చేశారు. వారి బట్టలను చింపేసి హింసించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.