విధాత : ఓ వార్తా పత్రికలో వచ్చిన యాడ్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆ యాడ్‌ను చూస్తే కచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఎందుకంటే అది అలాంటి యాడ్. నా డెత్ సర్టిఫికెట్ పొగొట్టుకున్నాను అని ఓ వ్యక్తి పేపర్‌కు యాడ్ ఇచ్చి.. అందరి దృష్టిని ఆకర్షించాడు. ఈ ప్రకటనను ఐపీఎస్ ఆఫీసర్ రూపిన్ శర్మ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేస్తూ.. ఇలాంటి ఘటనలు ఇండియాలోనే జరుగుతాయని క్యాప్షన్ ఇచ్చారు.
అసోం హోజాయి జిల్లాలోని లుండింగ్ బజార్‌కు చెందిన రంజిత్ కుమార్.. నా డెత్ సర్టిఫికెట్ పొగొట్టుకున్నాను అని పేపర్లో ప్రకటన ఇచ్చాడు. సెప్టెంబర్ 7వ తేదీన ఉదయం 10 గంటల సమయంలో సర్టిఫికెట్ మిస్ అయిందని పేర్కొన్నాడు. యాడ్‌లో డెత్ సర్టిఫికెట్ రిజిస్ట్రేషన్ నంబర్, సీరియల్ నంబర్‌ను కూడా పేర్కొన్నాడు.
ప్రస్తుతం ఈ యాడ్‌పై నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు. ఒక వేళ సర్టిఫికెట్ దొరికితే స్వర్గంలో ఇవ్వాలా? నరకంలో ఇవ్వాలా? అని ఓ నెటిజన్ సరదాగా ప్రశ్నించాడు. ఓ వ్యక్తి తన డెత్ సర్టిఫికెట్‌ను పొగొట్టుకున్నాడు. ఎవరికైనా దొరికితే త్వరగా ఇవ్వండి.. లేదంటే ఆ దెయ్యానికి కోపం రావొచ్చు అని మరో నెటిజన్ చమత్కరించాడు. డెత్ సర్టిఫికెట్ పోయిందని తనకు తానే యాడ్ ఇవ్వడం ఇదే మొదటిసారి అయి ఉండొచ్చని ఇంకో నెటిజన్ పేర్కొన్నాడు.
Latest News
విమాన టికెట్ రేట్లపై సీలింగ్.. కేంద్ర విమానయాన శాఖ కీలక నిర్ణయం
ఐజేయూ నేతలను సత్కరించిన గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్
విశాఖ వన్డేలో డికాక్ సెంచరీ..భారత్ టార్గెట్ 271 పరుగులు
మోదీ–పుతిన్ భేటీలో అందరి దృష్టిని ఆకర్షించిన ఓ అందం
వాళ్లు వస్తే మంచి రోజులు కాదు..ముంచే రోజులొస్తాయి: సీఎం రేవంత్ రెడ్డి
కేసుల పాలు చేసిన సర్పంచ్ ఏకగ్రీవ ఎన్నిక
కుంగిన జాతీయ రహదారి.. ఇరుక్కపోయిన వాహనాలు
13వ వారం ఊహించని ఎలిమినేషన్…
ఇండిగో బాధిత ప్రయాణికులకు రైల్వే, ఆర్టీసీ బాసట!
ఎడారి పాము ఎత్తులు ఎన్నో..క్షణాల్లో ఇసుకలోకి!