sex robots:నిజమైన లైంగిక భాగస్వామిలా వ్యవహరించేలా ఏఐ ఆధారిత రోబోలు.. గూగుల్ మాజీ ఎగ్జిక్యూటివ్ స్టన్నింగ్ కామెంట్స్
sex robots: శృంగారాన్ని చాలా మంది భూతు పదంలా చూస్తారు.కాని శృంగారం అనేది పవిత్ర కార్యం. ఇది జీవుల సృష్టికి తొలి మెట్టు. ఇద్దరు మనుషుల మధ్య నిజమైన ప్రేమ ఉన్నప్పుడే శృంగార జీవితాన్ని ఆస్వాదించవచ్చు. శృంగారం అనేది ప్రతి ఒక్కరికి మధురమైన అనుభూతి. ఇది ప్రేమానురాగాలను ఎంతో పెంచుతుంది .శృంగారంవల్లనే భూమిపై మనిషి మనుగడ కొనసాగుతుంది అనడంలో అతిశయోక్తి లేదు.సాధారణంగా మనుషుల మధ్య శృంగారం జరుగుతుంది అనేది అందరికి తెలిసిన విషయమే. కాని అమెరికా, బ్రిటన్ […]

sex robots: శృంగారాన్ని చాలా మంది భూతు పదంలా చూస్తారు.కాని శృంగారం అనేది పవిత్ర కార్యం. ఇది జీవుల సృష్టికి తొలి మెట్టు. ఇద్దరు మనుషుల మధ్య నిజమైన ప్రేమ ఉన్నప్పుడే శృంగార జీవితాన్ని ఆస్వాదించవచ్చు. శృంగారం అనేది ప్రతి ఒక్కరికి మధురమైన అనుభూతి. ఇది ప్రేమానురాగాలను ఎంతో పెంచుతుంది .శృంగారంవల్లనే భూమిపై మనిషి మనుగడ కొనసాగుతుంది అనడంలో అతిశయోక్తి లేదు.సాధారణంగా మనుషుల మధ్య శృంగారం జరుగుతుంది అనేది అందరికి తెలిసిన విషయమే. కాని అమెరికా, బ్రిటన్ , ఫ్రాన్స్ సహా చాలా దేశాల్లోని దంపతులు సంసార సుఖానికి దూరంగా ఉంటున్న నేపథ్యంలో మానవుల లైంగిక కోర్కెలు తీర్చేందుకు మనుషులను పోలిన రోబోట్ లను తయారు చేస్తున్నారు శాస్త్రవేత్తలు. ఈ రోబోట్‌లతో తమ శృంగార వాంఛలను తీర్చుకోవచ్చని అంటున్నారు.
అయితే ఏఐ ఆధారిత సెక్స్ రోబోలు నిజమైన లైంగిక భాగస్వామిలా మనతో వ్యవహరిస్తాయని గూగుల్ కంపెనీలో ఎగ్జిక్యూటివ్‌గా పనిచేసిన మొహమ్మద్ గవాదత్ తాజాగా వెల్లడించారు. కృత్రిమ మేధ వల్ల కలిగే శృంగార భావాలు ఎలా ఉంటాయనే విషయాన్ని కూడా ఆయన తెలియజేశారు. భాగస్వామితో మనం ఎంత థ్రిల్ అవుతామో రోబోలు కూడా మనల్ని అంత థ్రిల్ చేస్తున్నాయని అంటున్నారు. సినిమాల్లోనే కాదు.. రియల్ లైఫ్‌లో కూడా చాలా మంది సంపన్నులు రోబోలను తయారు చేయించుకొని తమ కామ వాంచలను తీర్చుకుంటున్నారు. ఇప్పుడు ప్రతి ఒక్కరు డబ్బుకి దాసోహం కావడంతో రోబోట్ లే వారికి స్వాంతన చేకూరుస్తున్నాయట..
వర్చువల్ రియాల్టీ హెడ్‌సెట్స్‌తో మనిషితో ఎలాంటి ఫీలింగ్స్ వస్తాయో దీంతో కూడా ఇలాంటి అనుభవాలు మనకు కలుగుతాయని గవాదత్ స్పష్టం చేశారు. కృత్రిమ మేధ రోజురోజుకి అభివృధ్ధి చెందుతున్న నేపథ్యంలో మనుషుల మధ్య బంధాలు బలహీనపడుతున్నాయి. యాపిల్ కంపెనీకి చెందిన విజన్ ప్రో, లేదా క్వెస్ 3 లాంటి ప్రత్యేకమైన హెడ్‌సెట్స్ తో మానవులు సంబోగాన్ని కృత్రిమ రీతిలో పొందే అవకాశం ఉందని గవాదత్ చెప్పుకొచ్చారు. ఏఐతో మనం మనుషుల ఎమోషన్స్‌ను మనం క్రియేట్ చేసామంటే అప్పుడు వాస్తవం, అవాస్తవాలేంటనేది చెప్పడం కష్టమని అన్నారు. ఈ టెక్నాలజీ డైరెక్ట్‌గా బ్రెయిన్‌లో ఇమిడిపోతున్న నేపథ్యంలో మనకు సొంత వ్యక్తితో మాట్లాడుతున్న ఫీలింగ్ కలుగుతుంది. సాధారణంగా రోబోలకి మనుషుల్లా ఫీలింగ్స్, ఎమోషన్స్ ఉండవని అనుకుంటారు. కాని ఏఐతో బలమైన బంధాన్ని ఏర్పర్చుకుంటే, ఆ భావన మనకు కలగదని గూగుల్ ఎగ్జిక్యూటివ్ తెలిపారు. అయితే ప్రస్తుత సమాజం ఇలాంటి వాటిని ఎంత వరకు యాక్సెప్ట్ చేస్తుందనే అనుమానం ఆయన వ్యక్తం చేశారు.
అయితే రోబోలతో శృంగార వాంఛలను తీర్చుకుంటున్న వారి సంఖ్య ఎక్కవ అవుతున్న నేపథ్యంలో రోబోలకి విపరీతంగా గిరాకీ పెరుగిపోతోందట. ఈ క్రమంలోనే రోబోలను చాలా అందంగా తీర్చిదిద్దడమే కాకుండా అవి శృంగార సమయంలో మసలుకుంటున్న విధానం పురుషులను ఎక్కువ తృప్తి పరుస్తుండటంతో రాను రాను గిరాకీ పెరుగుతోందట.