అమలాపాల్: ఆధ్యాత్మిక యాత్రా.. ఆరబోతల జాతరా!

విధాత‌, సినిమా: అమలాపాల్ పేరులోనే ఫైర్ బ్రాండ్ అనే ఇమేజ్ ఉంది. అలాగే ఆమెను కాంట్ర‌వ‌ర్శీల‌కు కేరాఫ్ అడ్రస్‌గా చెప్తారు. అమలాపాల్ తెలుగులో కూడా కొన్ని చిత్రాల్లో నటించింది. ఈ కేరళ కుట్టి నటిగా కాస్ట్యూమ్ డిజైనర్‌గా మంచి పేరు తెచ్చుకుంది. 2009లో సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చి తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం చిత్రాల్లో హీరోయిన్‌గా రాణించింది. మధ్యలో పెళ్లి మోజులో పడి కేరీర్‌ను నాశనం చేసుకుంది. ఆ పెళ్లి కాస్త పెటాకులు కావడంతో తర్వాత […]

  • By: Somu    latest    Feb 22, 2023 10:40 PM IST
అమలాపాల్: ఆధ్యాత్మిక యాత్రా.. ఆరబోతల జాతరా!

విధాత‌, సినిమా: అమలాపాల్ పేరులోనే ఫైర్ బ్రాండ్ అనే ఇమేజ్ ఉంది. అలాగే ఆమెను కాంట్ర‌వ‌ర్శీల‌కు కేరాఫ్ అడ్రస్‌గా చెప్తారు. అమలాపాల్ తెలుగులో కూడా కొన్ని చిత్రాల్లో నటించింది. ఈ కేరళ కుట్టి నటిగా కాస్ట్యూమ్ డిజైనర్‌గా మంచి పేరు తెచ్చుకుంది. 2009లో సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చి తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం చిత్రాల్లో హీరోయిన్‌గా రాణించింది. మధ్యలో పెళ్లి మోజులో పడి కేరీర్‌ను నాశనం చేసుకుంది. ఆ పెళ్లి కాస్త పెటాకులు కావడంతో తర్వాత అవకాశాల కోసం ఆరబోతల యాత్ర ఆరంభించింది.

మైనా అనే డబ్బింగ్‌ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత తెలుగు, తమిళంలో స్టార్ హీరోలతో సినిమా చేసింది. తెలుగులో నాయక్, ఇద్దరమ్మాయిలతో, లవ్ ఫెయిల్యూర్, జెండాపై కపిరాజు, మేము, ఆమె వంటి చిత్రాల్లో నటించింది.

View this post on Instagram

A post shared by Amala Paul (@amalapaul)

ఫామ్‌లో ఉండగానే డైరెక్టర్ ఏఎల్ విజయ్‌ని పెళ్లి చేసుకుంది. కొన్నాళ్లపాటు బాగానే ఉన్నారు. కానీ రెండేళ్లు కాకముందే విడాకులు తీసుకున్నారు. ఇప్పుడు మరో ప్రియుడితో సహజీవనంలో ఉన్నట్లుగా వార్తలు వైరల్ అవుతున్నాయి.

ఇక ఇటీవలే ఓ గుడిలోకి వెళ్లే విష‌యంలో వివాదం చోటు చేసుకుంది. కేరళలోని ఓ హిందూ దేవాలయానికి అమలాపాల్ వెళ్ళగా అక్కడి అర్చకులు ఆమెను అడ్డగించారు. వేరే మతానికి చెందిన వారికి గుడిలోకి ప్రవేశం లేదని క్లారిటీ ఇచ్చారు.

View this post on Instagram

A post shared by Amala Paul (@amalapaul)

దాంతో చేసేదేమి లేక మిగతా టెంపుల్స్‌ని సంద‌ర్శిస్తూ వెళ్తుంది. ప్రస్తుతం ఆధ్యాత్మిక టూర్‌లో ఉన్న అమలాపాల్.. ప్రతి గుడి దగ్గర తను తీసుకున్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తు కుర్రకారు గుండెల్లో హీట్‌ పెంచుతున్నది..

తమిళనాడులోని పళని కుమార్ స్వామి ఆలయానికి వెళ్లి స్వామి దర్శనం చేసుకున్న ఆమె ప్రస్తుతం బాలిలో పర్యటిస్తోంది. అక్కడ బస చేసినట్లుగా తెలియజేయడమే కాకుండా.. అక్కడి కోనేటిలో స్నానం చేస్తున్నట్లుగా కొన్ని ఫొటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది.

View this post on Instagram

A post shared by Amala Paul (@amalapaul)

ఈ ఫొటోలను చూసిన వారంతా.. ఆమె చేస్తుంది ఆధ్యాత్మిక టూరా.. లేక ఎక్స్‌పోజింగ్ టూరా అన్నట్లుగా కామెంట్ చేస్తుండటం విశేషం. ఇక ఈ ఫొటోలతో పాటు.. నీరు, అగ్ని, గాలి, భూమిలోని శక్తిని తనకు ఇవ్వాల్సిందిగా దేవుడిని ఆమె కోరింది. ప్రస్తుతం రెడ్ డ్రస్‌లో ఆమె షేర్ చేసిన ఫొటోలు వైర‌ల్ అవుతున్నాయి.