Site icon vidhaatha

సాగర్ టెయిల్ పాండ్‌ను ఖాళీ చేసిన ఏపీ

తాగునీటి సమస్యల ముప్పు
ఆలస్యంగా స్పందించిన తెలంగాణ

విధాత, హైదరాబాద్: నాగార్జున సాగర్ డ్యామ్ దిగువ ఉన్న టెయిల్ పాండ్ నుంచి 7టీఎంసీల నీటిని ఏపీ ప్రభుత్వం తరలించుకుపోయి ఖాళీ చేసేయడంతో రెండు రాష్ట్రాల మధ్య మరోసారి కృష్ణా జలాల తగదా నెలకొంది. టెయిల్ పాండ్ నుంచి నీటిని ఖాళీ చేయడంతో ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజలకు సాగుతాగునీటి ఇబ్బందులు ఎదురవుతాయని జిల్లా నాయకులు, సాగర్ పరివాహక ప్రాంతాల ప్రజలు ఆరోపిస్తున్నారు. టెయిల్ పాండ్ నుంచి ఏపీ నీటి తరలింపు విషయం ఆలస్యంగా స్పందించిన తెలంగాణ నీటి పారుదుల శాఖ కమిషనర్ సుల్తానియా రెండు రోజుల క్రితం టెయిల్ పాండ్‌ను సందర్శించారు. ఏపీ నీటిని తరలించిన తీరుపై అధికారుల ద్వారా వివరాలు సేకరించారు. టెయిల్ పాండ్ నీటి తరలింపులో ఏపీ తీరుపై కేఅర్ఎంబీకి తెలంగాణ ప్రభుత్వం ఫిర్యాదు చేయనున్నట్లుగా అధికారులు చెబుతున్నారు.

Exit mobile version