AP | ఆంధ్ర అప్పులు.. ఎవరి లెక్కలు వాళ్లవే! ఏది నిజమో ఆ భగవంతుడికే తెలియాలి

AP | ఆర్ధికమంత్రి నిర్మల, పురంధేశ్వరీల లెక్కలకు తేడా విధాత: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పుల కుప్ప అయింది, జగన్ మోహన్ రెడ్డి మొత్తం అప్పులు చేస్తూ రాష్ట్రాన్ని దివాళా తీయిస్తున్నారు అని టీడీపీ నాలుగేళ్లుగా ప్రచారం చేస్తూనే ఉంది. అయితే టీడీపీ చేస్తున్న ప్రచారం అంతా అబద్ధం. మేము అప్పులు చేస్తున్నాం కానీ టీడీపీ చేసిన అప్పుల కన్నా తక్కువే చేస్తున్నాం అని ప్రభుత్వం చెబుతోంది. జగన్ తోబాటు ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సైతం […]

  • Publish Date - July 29, 2023 / 03:31 AM IST

AP |

ఆర్ధికమంత్రి నిర్మల, పురంధేశ్వరీల లెక్కలకు తేడా

విధాత: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పుల కుప్ప అయింది, జగన్ మోహన్ రెడ్డి మొత్తం అప్పులు చేస్తూ రాష్ట్రాన్ని దివాళా తీయిస్తున్నారు అని టీడీపీ నాలుగేళ్లుగా ప్రచారం చేస్తూనే ఉంది. అయితే టీడీపీ చేస్తున్న ప్రచారం అంతా అబద్ధం. మేము అప్పులు చేస్తున్నాం కానీ టీడీపీ చేసిన అప్పుల కన్నా తక్కువే చేస్తున్నాం అని ప్రభుత్వం చెబుతోంది. జగన్ తోబాటు ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సైతం ఇదేమాట పలుమార్లు అన్నారు.

ఈ విషయంలో మొన్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ లోక్ సభలో చెప్పిన లెక్కల ప్రకారం చూసుకున్నా టీడీపీ హయాంలోనే ఎక్కువ అప్పులు చేసినట్లు తెలుస్తోంది. కానీ కొత్తగా వచ్చిన బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు మాత్రం జగన్ వచ్చాక రాష్ట్రం అప్పుల కుప్ప చేసేశారని అంటున్నారు.. చూస్తుంటే ఎవరి లెక్కలు వాళ్ళే వేసుకున్నట్లు తెలుస్తోంది.

ఇంతకూ మొన్న నిర్మల సీతారామన్ లోక్ సభలో చెప్పిన వివరాల మేరకు ఆంధ్రప్రదేశ్‌లో 2014-19 మధ్య టీడీపీ అధికారంలో ఉన్నపుడు రూ.2,64,451 కోట్లు అప్పు చేశారని, అయితే నేటికీ రాష్ట్రం మొత్తం అప్పు రూ.4,42,442 కోట్లకు చేరిందని నిర్మల సీతారామన్ తెలిపారు.

అంటే ఈ నాలుగేళ్లలో సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిన అప్పు రూ.1.77 లక్షల కోట్లు మాత్రమే అని మంత్రి వెల్లడించారు. ఇక నిన్న పురంధేశ్వరి లెక్క ప్రకారం అయితే ఏపీ అప్పు మొత్తం రూ. 10.77 లక్షల కోట్లు ఉంది. అందులో చంద్రబాబు కాలంలో చేసిన అప్పును మినహాయిస్తే మిగిలిన రూ.7, 14, 625 కోట్ల అప్పు జగన్ వచ్చాక చేశారని ఆమె లెక్క వేస్తున్నారు.

మరి అధికార హోదాలో కేంద్రమంత్రి నిర్మల ఇచ్చిన వివరాలు కూడా తప్పు అని, తాను చెబుతున్నదే అసలైన లెక్క అని పురంధేశ్వరి అంటున్నారు. మొత్తానికి ఆంధ్రా అప్పుల విషయంలో టిడిపి, బిజెపి, వైసిపి వాళ్ళు ఎవరి లెక్కలు వాళ్లు చెబుతున్నారు .. ఇందులో ఏది నిజమో ఆ భగవంతుడికే తెలియాలి.

Latest News