Kodad | ఇంజనీరింగ్ కాలేజ్ ఓనర్‌పై హత్యాయత్నం

<p>విధాత : సూర్యాపేట జిల్లా కోదాడ (Kodad) గేట్ ఇంజనీరింగ్ కాలేజ్ ఓనర్ పై హత్యాయత్నం కలకలం రేపింది. ఓనర్ బుడ్డే కాంతారావును హత్య చేసేందుకు కళాశాల భాగస్వాములు 50 లక్షల సుఫారి ఇచ్చేందుకు సుపారీ గ్యాంగ్‌తో ఒప్పందం చేసుకున్న నేపథ్యంలో హత్యాయత్నం జరిగినట్లు తెలుస్తోంది. సుఫారీ గ్యాంగ్‌కు ముందుగా ఐదు లక్షలు చెల్లించారని, వారు కాంతారావు ప్రయాణిస్తున్న కారును డీసీఎంతో ఢీ కొట్టాలని ప్లాన్ చేశారని బాధితుడి కథనం. మునగాల (మం) మొద్దుల చెరువు వద్ద […]</p>

విధాత : సూర్యాపేట జిల్లా కోదాడ (Kodad) గేట్ ఇంజనీరింగ్ కాలేజ్ ఓనర్ పై హత్యాయత్నం కలకలం రేపింది. ఓనర్ బుడ్డే కాంతారావును హత్య చేసేందుకు కళాశాల భాగస్వాములు 50 లక్షల సుఫారి ఇచ్చేందుకు సుపారీ గ్యాంగ్‌తో ఒప్పందం చేసుకున్న నేపథ్యంలో హత్యాయత్నం జరిగినట్లు తెలుస్తోంది.

సుఫారీ గ్యాంగ్‌కు ముందుగా ఐదు లక్షలు చెల్లించారని, వారు కాంతారావు ప్రయాణిస్తున్న కారును డీసీఎంతో ఢీ కొట్టాలని ప్లాన్ చేశారని బాధితుడి కథనం.

మునగాల (మం) మొద్దుల చెరువు వద్ద కాంతారావు కారును ఢీకొట్టేందుకు సఫారీ గ్యాంగ్ యత్నం చేయగా, అతను తప్పించుకున్నాడు. ఆ తర్వాత మరోసారి కోదాడ పట్టణంలో డీసీఎంతో కారును ఢీకొట్టగా, స్వల్ప గాయాలతో బయటపడ్డాడు.

ఈ ఘటనపై వెంటనే పోలీసులకు కాంతారావు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి 12 మంది గ్యాంగ్ సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. కాంతారావును హత్య చేసే కుట్రలో ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఉన్నట్లు అనుమానిస్తుండగా ఈ కేసులో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.