Kerala | ఆ ఉత్స‌వానికి స్త్రీల వేష‌ధార‌ణ‌లో పురుషులు.. పోటోలు చూస్తే పిచ్చెక్కాల్సిందే..!

Kerala | విధాత: భార‌త‌దేశం విభిన్న సంస్కృతుల స‌మ్మేళ‌నం.. దేశ‌మంత‌టా ఎన్నో ర‌కాల పండుగలు జ‌రుపుకుంటారు. ప్ర‌తి పండుగ‌కు ఒక ప్ర‌త్యేక‌త ఉంటుంది. వారి వారి సంస్కృతి, సంప్ర‌దాయాల ప్ర‌కారం పండుగల‌ను జ‌రుపుకుంటారు. అయితే కేర‌ళ‌(Kerala) కొల్లాం జిల్లా (Kollam Dist)లో జ‌రిగే ఉత్స‌వం ఎంతో ప్ర‌త్యేక‌మైన‌ది. ఎందుకంటే ఈ పండుగ విభిన్నంగా జ‌రుపుకుంటారు. చ‌మ‌య‌విళ‌క్కు పండుగ‌ (Chamayavilakku festival)కు స్థానికంగా ఉన్న పురుషులంతా స్త్రీల వ‌లే త‌యార‌వుతారు. స్త్రీల‌కు ఏ మాత్రం తీసిపోకుండా, అంత సొగ‌సుగా […]

  • Publish Date - March 31, 2023 / 06:14 PM IST

Kerala |

విధాత: భార‌త‌దేశం విభిన్న సంస్కృతుల స‌మ్మేళ‌నం.. దేశ‌మంత‌టా ఎన్నో ర‌కాల పండుగలు జ‌రుపుకుంటారు. ప్ర‌తి పండుగ‌కు ఒక ప్ర‌త్యేక‌త ఉంటుంది. వారి వారి సంస్కృతి, సంప్ర‌దాయాల ప్ర‌కారం పండుగల‌ను జ‌రుపుకుంటారు.

అయితే కేర‌ళ‌(Kerala) కొల్లాం జిల్లా (Kollam Dist)లో జ‌రిగే ఉత్స‌వం ఎంతో ప్ర‌త్యేక‌మైన‌ది. ఎందుకంటే ఈ పండుగ విభిన్నంగా జ‌రుపుకుంటారు. చ‌మ‌య‌విళ‌క్కు పండుగ‌ (Chamayavilakku festival)కు స్థానికంగా ఉన్న పురుషులంతా స్త్రీల వ‌లే త‌యార‌వుతారు. స్త్రీల‌కు ఏ మాత్రం తీసిపోకుండా, అంత సొగ‌సుగా త‌యార‌వుతారు. ఏ కోణం నుంచి చూసినా స్త్రీలే అన్న‌ట్టు క‌నిపిస్తారు.

ఈ చ‌మ‌య‌విళక్కు అనే పండుగ గురించి ఇండియ‌న్ రైల్వే ఆఫీస‌ర్ అనంత్ రూప‌న‌గుడి త‌న ట్విట్ట‌ర్ ఖాతా ద్వారా ఆస‌క్తిక‌ర విష‌యాలు పంచుకున్నారు. అచ్చం మ‌హిళ మాదిరిగా రెడీ అయి ఉన్న ఒక మ‌గాడి ఫోటోను ఆయ‌న షేర్ చేశారు.

కేర‌ళ కొల్లాం జిల్లాలోని కొట్టంకులంగ‌ర‌లోని దేవి ఆల‌యంలో చ‌మ‌య‌విళ‌క్కు అనే పండుగను జ‌రుపుకుంటారు. ఈ పండుగ ప్ర‌త్యేక‌త ఏంటంటే.. స్త్రీల వేష‌ధార‌ణ‌లో పురుషులు రెడీ అయి ఈ పండుగ‌ను జ‌రుపుకోవ‌డం ఆన‌వాయితీ. మ‌హిళ‌కు ఏ మాత్రం తీసిపోకుండా రెడీ అయిన ఆ పురుషుడికి మేక‌ప్‌లో మొద‌టి బ‌హుమ‌తి వ‌చ్చింద‌ని అనంత్ త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో పేర్కొన్నారు.

ఇక ఆ పురుషుడు చీర నుంచి మొద‌లుకుంటే మేక‌ప్ వ‌ర‌కు ఏ మాత్రం వెన‌క్కి త‌గ్గ‌లేదు. గ్రీన్ బార్డ‌ర్ ఉన్న మెరూర్ క‌ల‌ర్ చీర‌ను ధ‌రించి, అంద‌రి దృష్టిని ఆక‌ర్షించాడు. లిప్‌స్టిక్ నుంచి కోహ్ల్ రిమ్డ్ క‌ళ్లు,, ఐషాడో అన్ని చాలా చిన్న డీటైల్స్ లో జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌డం వ‌ల్ల అత‌ను పురుషుడు అని అనేందుకు అవ‌కాశం లేకుండా పోయింది. అంతే కాదు బంగారు ఆభ‌ర‌ణాలు ధ‌రించి, నుదుట‌న బిందీ, ఓపెన్ ప‌ల్లుతో సంపూర్ణ స్త్రీగా ద‌ర్శ‌న‌మిచ్చాడు.

అయితే ఈ పండుగ‌ను దీపాల పండుగ‌గా కేర‌ళ టూరిజం వారు అభివ‌ర్ణించారు. మార్చి 10, 11 తేదీల్లో మ‌ళ‌యాలం నెల‌ల్లో ఒక‌టైన మీన‌మ్ రోజుల్లో ఈ పండుగ‌ను జ‌రుపుకుంటార‌ని పేర్కొన్నారు.

Latest News