Bengaluru | అందంగా ఉన్నార‌ని ఉద్యోగం ఇవ్వ‌లే! బెంగ‌ళూరు యువ‌తికి వింత అనుభవం

Bengaluru | విధాత: సాధార‌ణంగా రెజ్యూమ్‌లో ఏ సంస్థ అయినా అభ్య‌ర్థి అనుభ‌వం, వ్య‌క్తిత్వం మొద‌లైన‌వి ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుని ఉద్యోగం ఇస్తుంది. కానీ బెంగ‌ళూరు లోని ఒక సంస్థ యువ‌తిని కాస్త ఎక్కువ‌ అందంగా ఉన్నార‌ని పేర్కొంటూ ఫైన‌ల్ రౌండ్‌లో రిజెక్ట్ చేయ‌డం ఇంట‌ర్నెట్‌లో చ‌ర్చ‌కు దారితీసింది. ప్ర‌తీక్ష జిచ్క‌ర్ అనే యువ‌తికి ఈ అనుభవం ఎదురుకాగా సామాజిక మాధ్య‌మాల్లో త‌న ఆవేద‌న‌ను వెల్ల‌డించింది. 'ఇప్పుడున్న టీం స‌భ్యుల‌తో పోలిస్తే నా స్కిన్ టోన్‌ కాస్త బాగుంది […]

  • Publish Date - July 27, 2023 / 11:59 AM IST

Bengaluru |

విధాత: సాధార‌ణంగా రెజ్యూమ్‌లో ఏ సంస్థ అయినా అభ్య‌ర్థి అనుభ‌వం, వ్య‌క్తిత్వం మొద‌లైన‌వి ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుని ఉద్యోగం ఇస్తుంది. కానీ బెంగ‌ళూరు లోని ఒక సంస్థ యువ‌తిని కాస్త ఎక్కువ‌ అందంగా ఉన్నార‌ని పేర్కొంటూ ఫైన‌ల్ రౌండ్‌లో రిజెక్ట్ చేయ‌డం ఇంట‌ర్నెట్‌లో చ‌ర్చ‌కు దారితీసింది. ప్ర‌తీక్ష జిచ్క‌ర్ అనే యువ‌తికి ఈ అనుభవం ఎదురుకాగా సామాజిక మాధ్య‌మాల్లో త‌న ఆవేద‌న‌ను వెల్ల‌డించింది.

‘ఇప్పుడున్న టీం స‌భ్యుల‌తో పోలిస్తే నా స్కిన్ టోన్‌ కాస్త బాగుంది అట‌.. అందుకే న‌న్ను ఫైన‌ల్ రౌండ్‌లో రిజెక్ట్ చేశారు’ అని వాపోయింది. ఆ కంపెనీ పంపిన మెయిల్‌ను సైతం పోస్ట్‌కు జ‌త చేసింది. ‘మా ఇంట‌ర్వ్యూలు హాజ‌రైనందుకు ధ‌న్య‌వాదాలు. కొన్ని కార‌ణాల వ‌ల్ల మిమ్మ‌ల్ని ఈ ఉద్యోగానికి తీసుకోలేక‌ పోతున్నాం. మేము ఆఫ‌ర్ చేస్తున్న పోస్టుకు కావాల్సిన నైపుణ్యం, అర్హ‌త‌ అన్నీ మీకున్నాయి.

కానీ మా సంస్థ స‌మాన‌త్వానికి పెద్ద పీట వేస్తుంది. మిమ్మ‌ల్ని ఆహ్వానించాల్సిన టీంలో స‌భ్యులంద‌రి కంటే మీరు కాస్త ఫెయిర్‌గా ఉంటారు. ఇది అస‌మాన‌త‌ల‌కు దారి తీస్తుంది. అందుకే మిమ్మ‌ల్ని ఈ పోస్టుకు రిజెక్ట్ చేస్తున్నాం’ అని మెయిల్‌లో ఉంది. అయితే ఆ సంస్థ పేరును మాత్రం ఆమె త‌న పోస్టులో వెల్ల‌డించ‌లేదు.

ప‌బ్లిసిటీ స్టంట్ అన్న నెటిజ‌న్లు

ప్ర‌తీక్ష జిచ్క‌ర్ రాసిన ఈ పోస్టు లింక్డిన్‌, రెడిట్‌, ఎక్స్ వేదిక‌ల‌పై వైర‌ల్ అయింది. అయితే చాలా మంది ఈ ఘ‌ట‌న నిజ‌మా కాదా అనే సందేహాల‌నూ వెలిబుచ్చారు. హెచ్ ఆర్‌లు ఎప్పుడూ తిర‌స్క‌ర‌ణ‌కు గురైన అభ్య‌ర్థికి కార‌ణాలు చెప్ప‌ర‌ని ఒక‌రు వ్యాఖ్యానించారు. ‘కంపెనీలు టీంలో భిన్న‌త్వం కోసం ప్ర‌య‌త్నించిన‌ ప్పుడు కొన్ని సార్లు కొంత‌మందికి అన్యాయం జ‌ర‌గ‌డం స‌హ‌జ‌మే.. కానీ వారు ఆ విష‌యాల‌ను ఇలా మెయిల్‌లో ప్ర‌స్తావించ‌రు’ అని రెడిట్‌లో మ‌రో యూజ‌ర్ పేర్కొన్నారు. ఎక్స్ లో మ‌రొక‌రు ఇది ఒక ప‌బ్లిసిటీ స్టంట్ అని కొట్టి ప‌డేశారు.

Latest News