Bhola Shankar | భోళా శంక‌ర్ ఈవెంట్ కోసం భారీ స‌న్నాహాలు.. ఎప్పుడు, ఎక్క‌డ‌?

Bhola Shankar | మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం భోళా శంక‌ర్ మెహ‌ర్ ర‌మేష్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌గా, ఈ మూవీ ఆగ‌స్ట్ 11న విడుద‌ల కానుంది. వాల్తేరు వీర‌య్య వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ త‌ర్వాత చిరంజీవి న‌టిస్తున్న ఈ సినిమాపై అంచ‌నాలు పీక్స్‌లో ఉన్నాయి. ఇప్ప‌టికే సినిమా నుండి విడుద‌లైన ప్ర‌చార కార్యక్ర‌మాలు మూవీపై మ‌రింత ఆస‌క్తిని క‌లిగించాయి. మాస్ ఎంటర్టయినర్ చిత్రంగా భోళా శంకర్ రూపొంద‌గ‌గా, ఈ సినిమా ఇప్ప‌టికే సెన్సార్ పనులు కూడా […]

  • Publish Date - August 3, 2023 / 12:36 PM IST

Bhola Shankar |

మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం భోళా శంక‌ర్ మెహ‌ర్ ర‌మేష్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌గా, ఈ మూవీ ఆగ‌స్ట్ 11న విడుద‌ల కానుంది. వాల్తేరు వీర‌య్య వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ త‌ర్వాత చిరంజీవి న‌టిస్తున్న ఈ సినిమాపై అంచ‌నాలు పీక్స్‌లో ఉన్నాయి.

ఇప్ప‌టికే సినిమా నుండి విడుద‌లైన ప్ర‌చార కార్యక్ర‌మాలు మూవీపై మ‌రింత ఆస‌క్తిని క‌లిగించాయి. మాస్ ఎంటర్టయినర్ చిత్రంగా భోళా శంకర్ రూపొంద‌గ‌గా, ఈ సినిమా ఇప్ప‌టికే సెన్సార్ పనులు కూడా పూర్తి చేసుకుంది. ఎప్పుడెప్పుడు సినిమా విడుద‌ల అవుతుందా అని ఫ్యాన్స్ ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.

అయితే భోళా శంకర్ చిత్ర రిలీజ్ ద‌గ్గర ప‌డుతున్న నేప‌థ్యంలో మేక‌ర్స్ ప్రమోష‌న్ కార్య‌క్ర‌మాలు వేగ‌వంతం చేస్తున్నారు. ఈ క్ర‌మంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ జ‌రిపేందుకు కూడా సన్నాహాలు చేస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆగ‌స్ట్ 6న ఆదివారం నాడు గ్రాండ్‌గా జ‌ర‌గ‌బోతున్న‌ట్టు తెలుస్తుంది..

ఇక ఈ వేడుక‌ని హైద‌రాబాద్‌లో నిర్వహించ‌నున్నారా, లేకుంటే విజయవాడలోనా అనే విషయంలో ఇంకా సందిగ్థత కొనసాగుతుంది. అయితే ఫిలిం న‌గ‌ర్ స‌మాచారం మేర‌కు ఈ వేడుక హైదరాబాద్ లో జరిగే అవకాశం ఎక్కువగా ఉన్న‌ట్టు తెలుస్తుంది.

హైద‌రాబాద్‌లో ఈవెంట్ నిర్వ‌హిస్తే మాత్రం శిల్పకళా వేదికలో జరిగే అవకాశాలున్నాయి. ఇక ఈ ఈవెంట్‌కి గెస్ట్ గా ఎవ‌రు వ‌స్తార‌నే సందేహం కూడా అంద‌రిలో ఉంది. మెగా హీరో ఒక‌రు గెస్ట్‌గా వ‌స్తార‌ని టాక్ వినిపిస్తుంది. త్వ‌ర‌లోనే ఈ ఈవెంట్‌కి సంబంధించి అధికారిక ప్ర‌క‌ట‌న వ‌చ్చే అవ‌కాశం ఉంది.

ఏకే ఎంటర్టయిన్ మెంట్స్ పతాకంపై రూపొందిన భోళా శంక‌ర్ చిత్రంలో చిరంజీవి సరసన మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా నటిస్తుండ‌గా, కీర్తి సురేశ్ మెగాస్టార్ కు చెల్లెలిగా నటిస్తుండడం విశేషం. అక్కినేని హీరో సుశాంత్ ఈ చిత్రంలో కీల‌క పాత్ర‌లో సంద‌డి చేయ‌నున్నాడు. మణిశర్మ తనయుడు మహతి స్వరసాగర్ సంగీతం అందదిస్తున్నాడు. మెగా అభిమానులకు మంచి విజ్యూవల్ ఫీట్ గా ఈ చిత్రం ఉంటుంద‌ని నెటిజ‌న్స్ అంటున్నారు.

Latest News