Boianapalli | అబద్దాల అమిత్‌ షా.. తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి

Boianapalli రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్‌ హైదరాబాద్‌, విధాత: అబద్దాల అమిత్‌ షా తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌(Boianapalli Vinod Kumar) డిమాండ్‌ చేశారు. సోమవారం మంత్రుల నివాస ప్రాంగణంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా నిన్న చేవెళ్ల సభలో అన్ని అబద్దాలు చెప్పారన్నారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి ఎంత మోసం చేస్తుందనే విషయం బీజేపీ […]

  • Publish Date - April 24, 2023 / 12:42 PM IST

Boianapalli

  • రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్‌

హైదరాబాద్‌, విధాత: అబద్దాల అమిత్‌ షా తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌(Boianapalli Vinod Kumar) డిమాండ్‌ చేశారు. సోమవారం మంత్రుల నివాస ప్రాంగణంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా నిన్న చేవెళ్ల సభలో అన్ని అబద్దాలు చెప్పారన్నారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి ఎంత మోసం చేస్తుందనే విషయం బీజేపీ రాష్ట్ర నాయకులకు ఎందుకు కనిపించడం లేదోనని అన్నారు.

ఆదాయ లెక్కలను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి, బండి సంజయ్ కి పంపిస్తా… కేంద్ర ప్రభుత్వాన్ని అడగండన్నారు. బీజేపీకి మతాల మధ్య చిచ్చు పెట్టే పని తప్ప ఇతర ఏ పని లేదన్నారు. కిషన్ రెడ్డికి, బండి సంజయ్‌కి సవాల్ చేస్తున్నా అన్నారు…

తెలంగాణ రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి దేశంలో బీజేపీ పాలిత రాష్ట్రాలలో కానీ, ఏ రాష్ట్రంలో అయిన ఉందా.. ఉంటే చూపండన్నారు. ఫలానా రాష్ట్రం బాగుందని మీరు చూపిస్తా అంటే నేను వస్తానన్నారు. రాజకీయాలు వేరు అభివృద్ధి వేరని తెలిపిన ఆయన ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజమన్నారు. ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి ముఖ్యం అన్న విషయాన్ని మరువద్దని బీజేపీ నేతలకు Boianapalli హితవు పలికారు.

స్వల్ప కాలంలో తెలంగాణ అభివృద్ధి జరిగిందన్న విషయాన్ని గమనించండన్నారు. ఇతర దేశాలు, రాష్ట్రాల వాళ్ళు హైదరాబాద్ కి వచ్చి సింగపూర్ కి వచ్చామా.. అని ఆశ్చర్య పోతున్నారని తెలిపారు. రోడ్ సెస్ కింద తెలంగాణ రాష్ట్రం రూ. 39,189 కోట్లు కేంద్రానికి చెల్లిస్తే… కేంద్రం మాత్రం రాష్ట్రానికి చెందిన రోడ్లకు రూ. 34 వేల కోట్లు మాత్రమే ఇచ్చిందని, ఇంకా రాష్ట్ర ప్రభుత్వానికి రూ. 5 వేల కోట్లు రావాల్సి ఉందని గుర్తు చేశారు.

రాష్ట్రానికి వివిధ గ్రాంట్ల కింద రూ.ఒక లక్షా 20 వేల కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందని కేంద్ర మంత్రి అమిత్ షా చేవెళ్ల సభలో చెప్పారని అయితే వాస్తవంగా అందులో నాలుగో వంతు నిధులు కూడా ఇవ్వలేదని తెలిపారు. 2014-15 లో రాష్ట్రానికి రూ. 30,000 వేల కోట్లు ఇచ్చినట్లు అమిత్ షా చెప్పారు కానీ, వాస్తంగా రూ. 15,307 కోట్లు మాత్రమే కేంద్రం ఇచ్చిందని తెలిపారు. అమిత్ షా పచ్చి అబద్ధాలు మాట్లాడారని, తెలంగాణ రాష్ట్రానికి మోసం చేసే లెక్కలను అమిత్ షా వెంటనే సరి చేసుకోవాలన్నారు. అబద్ధాలు చెప్పినందుకు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అమిత్ షా క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు.

విభజన చట్టంలో ఉన్న ప్రకారమే జాతీయ రహదారులు చేశారని, ఇది తెలంగాణ రాష్ట్ర ప్రజల హక్కు అని వినోద్‌కుమార్‌ తెలిపారు. వాస్తవంగా చట్టంలో ఉన్న ప్రకారం కాజీపేట కోచ్‌ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని, ఎన్టీపీసిలో విద్యుత్ కేంద్రం పెట్టాలని, బయ్యారం ఉక్కు కర్మాగారం పెట్టాలని విభజన హామిలో భాగంగా ఆనాటి యుపీఏ ప్రభుత్వం పొందుపర్చింది కానీ కేంద్రం నుంచి ఇప్పటి వరకు రాష్ట్రానికి ఏ ఒక్కటి రాలేదని తెలిపారు.

Latest News