Breaking విధాత: తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని మద్యం దుకాణాల కొత్త లైసెన్సుల జారీ కోసం టెండర్లకు నోటిఫికేషన్ జారీ చేసింది . ప్రస్తుత మద్యం దుకాణాల లైసెన్సులు ఈ ఏడాది నవంబర్లో ముగియనున్నాయి. ప్రస్తుత దుకాణాల లైసెన్సులకు మరో మూడు నెలల సమయం ఉండగానే ప్రభుత్వం ముందుగానే నోటిఫికేషన్ జారీ చేయడం గమనార్హం. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ముందుగానే కొత్త వైన్స్ దుకాణాల టెండర్లకు నోటిఫికేషన్ జారీ చేయడం చర్చనీయాంశమైంది. కొత్త మద్యం దుకాణాల […]
Breaking
విధాత: తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని మద్యం దుకాణాల కొత్త లైసెన్సుల జారీ కోసం టెండర్లకు నోటిఫికేషన్ జారీ చేసింది . ప్రస్తుత మద్యం దుకాణాల లైసెన్సులు ఈ ఏడాది నవంబర్లో ముగియనున్నాయి. ప్రస్తుత దుకాణాల లైసెన్సులకు మరో మూడు నెలల సమయం ఉండగానే ప్రభుత్వం ముందుగానే నోటిఫికేషన్ జారీ చేయడం గమనార్హం.
రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ముందుగానే కొత్త వైన్స్ దుకాణాల టెండర్లకు నోటిఫికేషన్ జారీ చేయడం చర్చనీయాంశమైంది. కొత్త మద్యం దుకాణాల టెండర్ల దరఖాస్తు ఫీజును రెండు లక్షలుగా నిర్ణయించారు.
ఈ రెండు లక్షల రూపాయల దరఖాస్తు ఫీజు తిరిగి ఇవ్వబడదు. తాజాగా రాష్ట్రంలో 2023 25 సంవత్సరా లకు గాను 2,620 వైన్స్ లకు ప్రభుత్వం టెండర్ల నోటిఫికేషన్ జారీ చేసింది. డ్రా విధానంలో కొత్త వైన్స్ లకు లైసెన్స్ ఇస్తారు.
ఈనెల మూడవ తేదీన అంటే నేడు మద్యం దుకాణాల గౌడ సామాజిక వర్గంకు, ఎస్సీ, ఎస్టీ లకు రిజర్వేషన్ల ను కలెక్టర్లు ఖరారు చేస్తారు. నాలుగో తేదీన అధికారిక నోటిఫికేషన్ జారీ అవుతుంది. అదే రోజు నుంచి 18 వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు.
21వ తేదీన మద్యం దుకాణాల కేటాయింపులకు డ్రా తీస్తారు. 21 నుంచి 22వ తేదీ వరకు తమ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ మొత్తం చెల్లించాలి. నవంబర్30 నుంచి కొత్త షాపులకి మద్యం స్టాక్ రిలీజ్ చేస్తారు అక్టోబర్ 1న కొత్త లైసెన్సులు పొందిన మద్యం దుకాణాలు ప్రారంభమవుతాయి.
ఇప్పటికే 2620 దుకాణాలలో 34 జిల్లాలకు గాను 393 దుకాణాలను గౌడలకు రిజర్వ్ చేశారు. ఎస్సీలకు 262, షెడ్యూల్ ఏరియా ఎస్టీలకు 95, నాన్ షెడ్యూల్ ఏరియా ఎస్టీలకు 36 , మొత్తం ఎస్సీ, ఎస్టీలకు 131రిజర్వ్ చేశారు. మొత్తంగా గౌడ ,ఎస్సీ, ఎస్టీలకు 786 దుకాణాలను రిజర్వ్ చేశారు. ఓపెన్ కేటగిరీలో 1834 దుకాణాలు ఉన్నాయి.