Site icon vidhaatha

వేం నరేందర్‌రెడ్డి తీరుపై ఈసీకి బీఆరెస్ ఫిర్యాదు

విధాత : కేబినెట్ హోదాతో సీఎం సలహాదారుగా ఉండి ప్రభుత్వ ఖజానా నుంచి జీతభత్యాలు పొందుతున్న వేం నరేందర్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీ మీటింగ్‌లో పాల్గొనడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తూ బీఆరెస్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. వేం నరేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న మహబూబాబాద్ జనజాతర సభకు సంబంధించిన ప్రెస్ మీట్‌లో పాల్గొన్నారని, ఇది ముమ్మాటికి ఎన్నికల నియమావళిని ఉల్లంఘించడమేనని బీఆరెస్ పేర్కోంది. సలహాదారులకు కూడా ఎన్నికల నియమావళి వర్తిస్తుందని ఎన్నికల కమిషన్ ఇప్పటికే స్పష్టం చేసి ఉందని, నిబంధనలను బేఖాతరు చేసిన వేం నరేందర్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని బీఆరెస్ తన ఫిర్యాదులో కోరింది.

Exit mobile version